డిసెంబరు - 2018 అంతర్జాతీయం డిసెంబరు - 2 |
¤ మెక్సికో నూతన అధ్యక్షుడిగా వామపక్షనేత ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రడార్ డిసెంబరు 1న ప్రమాణం చేశారు. » ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌లు హాజరయ్యారు. |
డిసెంబరు - 3 |
¤ అరబ్ దేశం ఖతార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్) నుంచి 2019 జనవరిలో వైదొలగనున్నట్లు ప్రకటించింది. |
డిసెంబరు - 5 |
డిసెంబరు - 6 |
¤ దలైలామా వారసుడి ఎంపికలో చైనా ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తాము వ్యతిరేకిస్తామని అమెరికా స్పష్టం చేసింది. » టిబెట్‌లోని బౌద్ధ మతస్థుల అత్యున్నత అధినేతనే దలైలామా అని పిలుస్తారు. ప్రస్తుత దలైలామా వయసు 83 సంవత్సరాలు కావడంతో ఆయన వారసుడిగా తనకు విధేయుడిగా ఉండే వ్యక్తిని నియమించాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది. |
డిసెంబరు - 10 |
¤ బ్రెగ్జిట్‌పై పార్లమెంట్‌లో డిసెంబరు 11న జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే ప్రకటించారు. » బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో తాను కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశాలపై ఎంపీల్లో విభేదాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు. » రూ.9000 కోట్ల రుణాలు ఎగవేసిన మాల్యా 2016లో బ్రిటన్‌కు పరారయ్యారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను నడపడంతోపాటు భిన్న వ్యాపారాలు చేసిన ఆయనపై అక్రమ నగదు చెలామణి, ఇతర అవసరాలకు రుణాల నిధులు మళ్లింపు ఆరోపణలూ ఉన్నాయి. » ఆయన్ను అప్పగించాలన్న భారత్ అభ్యర్థనపై లండన్‌లోని వెస్ట్ మిన్‌స్టర్ మేజిస్ట్రేట్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ జడ్జి ఎమ్మా ఆర్బత్‌నాట్ ఏడాదిపాటు విచారణ అనంతరం తీర్పు ఇచ్చారు. » తీర్పు అనంతరం జడ్జి ఎమ్మా ఈ కేసును హోంమంత్రి సాజిద్ జావిద్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో తుది నిర్ణయం తీసుకునేది హోంమంత్రే. తీర్పు ఆధారంగా ఆయన తన నిర్ణయాన్ని రెండు నెలల్లోగా వెల్లడిస్తారు. ఈ తీర్పుపై హైకోర్టులో మాల్యా అప్పీలు చేసుకోవచ్చు. |
డిసెంబరు - 12 |
¤ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రధానిగా తొలగించిన రణిల్ విక్రమసింఘేపై పార్లమెంటు విశ్వాసం ప్రకటించింది. » మొత్తం 225 మంది సభ్యులకుగాను తీర్మానానికి అనుకూలంగా 117 మంది ఓటు వేశారు. గతంలో సిరిసేన వ్యక్తిగత కారణాలతో విక్రమ సింఘేను తొలగించి మహింద రాజపక్సను ప్రధానిగా నియమించారు. రాజపక్స ఇప్పటివరకు పార్లమెంటులో మెజార్టీ నిరూపించుకోలేదు. |
డిసెంబరు - 13 |
¤ శ్రీలంక పార్లమెంటును రద్దు చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. » పార్లమెంటు కాల పరిమితి అయిదేళ్లు కాగా, కనీసం నాలుగున్నరేళ్లపాటు కొనసాగాల్సి ఉంది. ఆ కాలపరిమితి పూర్తికాకుండా రద్దు చేయడం తగదని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది.¤ మాలిలోని ఈశాన్య ప్రాంతమైన మెనకలో సాయుధులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఘటనలో 47 మంది పౌరులు మరణించారు. » ఇక్కడ టౌరెగ్, పియూల్, పులానీ సంచార తెగలు నివాసం ఉంటాయి. నీరు, భూముల కోసం వీరి మధ్య ఎప్పటికప్పుడు ఘర్షణలు జరుగుతుంటాయి. మరో వైపు ఇక్కడ ఉగ్రవాదులూ దాడులకు తెగబడుతుంటారు. ప్రస్తుతం ఉగ్రవాదులు టౌరెగ్ తెగను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. |
డిసెంబరు - 14 |
¤ భారత కరెన్సీలోని పెద్దనోట్ల వినియోగాన్ని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. రూ.2000, రూ.500 రూ.200 నోట్లను వాడొద్దని స్పష్టం చేసింది. » రూ.100 కంటే ఎక్కువ విలువైన భారతీయ కరెన్సీని నేపాల్ ప్రభుత్వం చట్టబద్ధం చేయలేదు. అందుకే ఈ నోట్లను నిషేధించినట్లు నేపాల్ సమాచార, ప్రసార శాఖ మంత్రి గోకుల్ ప్రసాద్ ప్రకటించారు. |
డిసెంబరు - 15 |
¤ ఆరోగ్య బీమా కోసం మునుపటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ‘అఫర్డ్‌బుల్ కేర్ చట్టం' (ఒబామా కేర్)ను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ టెక్సాస్‌లోని ఒక ఫెడరల్ జడ్జి కొట్టేశారు. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రాజకీయంగా పెద్ద విజయం లభించినట్లయ్యింది. ఆ చట్టానికి ముగింపు పలకాలని చాలా కాలంగా ఆయన కోరుకుంటున్నారు. ¤ శ్రీలంకలో వివాదాస్పద రీతిలో ప్రధానిగా నియమితులైన మహింద రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఈ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. » వ్యక్తిగత కారణాలతో అక్టోబరు 26న విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తొలగించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆ పదవిలో రాజపక్సేను నియమించారు. పార్లమెంటులో రాజపక్సేకు బలం లేకపోవడంతో ఏకంగా పార్లమెంటునే రద్దు చేసి ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారు. అయితే పార్లమెంటును రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాజపక్సే పదవిలో కొనసాగడం తగదని సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది. దీనికి అనుగుణంగా రాజపక్సే పదవి నుంచి వైదొలిగారు. |
డిసెంబరు - 16 |
డిసెంబరు - 18 |
డిసెంబరు - 20 |
¤ ముంబయిలో మొహమ్మద్ అలీ జిన్నా నివసించిన భవనం తమకే చెందుతుందని పాకిస్థాన్ ఉద్ఘాటించింది. జిన్నా హౌస్‌ను నియంత్రణలోకి తీసుకునేందుకు భారత్ చేసే ప్రయత్నాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. » జిన్నా ఇంటిని నవీకరించి దిల్లీలోని హైదరాబాద్ హౌస్ తరహాలో తీర్చిదిద్దాలని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఆదేశించిందని ఇటీవల విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్) నుంచి ఆ భవనాన్ని తమ శాఖకు బదిలీ చేసుకున్నట్లు తెలిపారు. » ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై పాకిస్థాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ పైవిధంగా స్పందించారు. జిన్నా హౌస్ పాక్‌దేనని భారత్ గతంలో అంగీకరించినట్లు ఆయన తెలిపారు. |
డిసెంబరు - 21 |
డిసెంబరు - 22 |
¤ అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ సంక్షోభం తలెత్తింది. ఫెడరల్ వ్యయ బిల్లును ఆమోదించకుండానే కాంగ్రెస్ వాయిదా పడటంతో ప్రభుత్వం పాక్షికంగా మూతపడింది. డిసెంబరు 21 అర్ధరాత్రి నుంచి పలు కీలక సంస్థల కార్యకలాపాలు స్తంభించాయి. » మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం సుమారు రూ.35 వేల కోట్లు (5 బిలియన్ డాలర్లు) కేటాయించాలంటూ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పట్టుబట్టడం, దాన్ని డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో తాజా సంకటస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మూతపడటంతో దాదాపు ఎనిమిది లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు వేతనాలు అందే అవకాశం లేకుండాపోయింది. » ఈ ఏడాది అమెరికా ప్రభుత్వం పాక్షికంగా మూతపడటం ఇది మూడోసారి. |
డిసెంబరు - 24 |
డిసెంబరు - 29 |
¤ ఈజిప్టులో ఉగ్రవాదులపై పోలీసులు భారీ ఎత్తున దాడులు జరిపారు. ఈ దాడుల్లో 40 మంది ముష్కరులను మట్టుబెట్టారు. |
డిసెంబరు - 30 |
¤ బంగ్లాదేశ్ ఎన్నికల ప్రాథమిక ఫలితాలు అధికారపార్టీ అవామీ లీగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది. » ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 151 స్థానాలను అవామీ లీగ్ తేలికగా అధిగమించినట్లు ఓ ప్రైవేట్ ఛానెల్ తెలిపింది. |
డిసెంబరు - 31 |
¤ ఉక్కు మహిళగా పేరుగాంచిన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా (71) తాజా ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని పీఠాన్ని నవంబరు - 2018 రాష్ట్రీయం |
No comments:
Post a Comment