పార్లమెంటు- ఖాళీలు ఏర్పడే పద్ధతి (Vacation of Seats) (ప్రకరణ 101)
ఈ కింది సందర్భాల్లో పార్లమెంటులో స్థానాలు ఖాళీ ఏర్పడినట్లుగా భావిస్తారు. |
రాజీనామా: పార్లమెంటు సభ్యులు తమ రాజీనామా పత్రాన్ని సంబంధిత సభాధ్యక్షులకు సమర్పించాలి. ఉదాహరణకు లోక్‌సభ సభ్యులైతే స్పీకర్‌కు, రాజ్యసభ సభ్యులైతే రాజ్యసభ చైర్మన్‌కు స్వదస్తూరీతో తమ రాజీనామా పత్రాలను వ్యక్తిగతంగా ఇవ్వాలి. ఆ రాజీనామాను స్వచ్ఛందంగా చేశారా? లేదా? అని విచారించిన తర్వాతే సభాధ్యక్షులు ఆమోదిస్తారు.
గైర్హాజరు: పార్లమెంటు సభ్యులు సభాధ్యక్షుల అనుమతి లేకుండా నిరవధికంగా 60రోజులు గైర్హాజరైతే సభ్యత్వం కోల్పోతారు. ద్వంద్వ సభ్యత్వం కలిగి ఉన్నప్పుడు: సభ్యులు ఏక కాలంలో రెండు సభల్లో సభ్యత్వం కలిగి ఉంటే ఏదైనా ఒక సభలో సభ్యత్వం కోల్పోతారు. అది ఎలాగంటే.. రాజ్యసభ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికైతే.. ఎన్నికైన పదిరోజుల్లోపు తన అభీష్టాన్ని తెలియజేయాలి. లేదంటే రాజ్యసభలో సభ్యత్వం రద్దవుతుంది. అప్పటికే ఒక సభలో సభ్యునిగా ఉండి మరో సభకు ఎన్నికైతే మొదట సభ్యునిగా ఉన్న సభలో సభ్యత్వం రద్దవుతుంది. ఉదాహరణకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి రాజ్యసభకు ఎంపికైతే తన ఐచ్ఛికాన్ని తెలియజేయని పక్షంలో లోక్‌సభ సభ్యత్వం రద్దవుతుంది. ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీచేసి.. రెండిటిలోనూ గెలిచి నిర్ణీత గడువులో (10 రోజులు) తన ఐచ్ఛికాన్ని తెలపకపోతే రెండు స్థానాల్లోనూ తన సభ్యత్వం కోల్పోతాడు. రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికైతే 14 రోజుల్లో రాష్ట్ర శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలి. లేని పక్షంలో పార్లమెంటు సభ్యత్వం రద్దవుతంది. ఇతర కారణాలు: పార్లమెంటు సభ్యుని ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పినప్పుడు, సభ్యుడు ఆ సభతో బహిష్కరణకు గురైనప్పుడు, పార్లమెంటు సభ్యులు.. రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు, గవర్నర్‌గా నియమితులైనప్పుడు. ఇతర కారణాల వల్ల అనర్హుడిగా ప్రకటించినప్పుడు పార్లమెంట్‌లో ఖాళీలు ఏర్పడతాయి. పార్లమెంటు - చర్చలు - అధికార భాష (ప్రకరణ 120) పార్లమెంటు చర్చలు హిందీ లేదా ఇంగ్లిష్‌లో జరుగుతాయి. సభాధ్యక్షుల అనుమతితో మాతృభాషల్లో కూడా సభ్యులు మాట్లాడొచ్చు. సభాధ్యక్షులు - లోక్‌సభ స్పీకర్,డిప్యూటీ స్పీకర్ (Presiding Officers) (ప్రకరణ 93 నుంచి 96) పార్లమెంటు ప్రతి సభలోనూ సభాధ్యక్షులు, ఉప సభాధ్యక్షులు ఉంటారు. లోక్‌సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్; రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. వీరు ఆయా సభలకు అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రకరణ 93లో స్పీకర్ పదవిని ప్రస్తావించారు. భారతదేశంలో మొదటిసారిగా 1921లో ఈ సభాపతి పదవిని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో స్పీకర్‌ను అధ్యక్షుడిగా పిలిచేవారు. 1935లో అధ్యక్షుడనే పదాన్ని స్పీకర్‌గా మార్చారు. 1946లో డిసెంబర్ 9 నుంచి 1947 నవంబర్ 16 వరకు స్పీకర్ పదవిని రాజ్యాంగ సభ రద్దు చేసింది. 1946 నుంచి 1949 వరకు రాజ్యాంగ పరిషత్తే శాసనసభగా వ్యవహరించింది. జి.వి.మౌలాంకర్ మొట్టమొదటి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నిక: స్పీకర్‌ను లోక్‌సభ ప్రారంభ సమావేశంలో సభ్యులు మెజారిటీ ప్రాతిపదికపై నేరుగా ఎన్నుకుంటారు. స్పీకర్‌గా ఎన్నికయ్యేందుకు లోక్‌సభలో సభ్యత్వం కలిగి ఉండాలి. కాలపరిమితి: లోక్‌సభ స్పీకర్ పదవీ కాలం ఐదేళ్లు. కానీ, నూతన స్పీకర్ ఎన్నికయ్యేంతవరకు పదవిలో కొనసాగుతారు. లోక్‌సభ రద్దయినా, తన కాలవ్యవధి పూర్తయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. కొత్త లోక్‌సభ ఏర్పడి స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు పదవిలో ఉంటారు. తొలగింపు పద్ధతి (ప్రకరణ 94 (c)): ప్రకరణ 94 ప్రకారం స్పీకర్‌ను లోక్ సభ తొలగిస్తుంది. పదవిని దుర్వినియోగపరచడం, రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణాలపై స్పీకర్‌ను తొలగించవచ్చు. సభలో తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందస్తు నోటీసును స్పీకర్‌కు ఇవ్వాలి.సభకు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ తన పదవి నుంచి దిగిపోతాడు. స్పీకర్‌ను తొలగించే తీర్మానం సభా పరిశీలనలో ఉన్నప్పుడు స్పీకర్ సభకు అధ్యక్షత వహించరాదు. కానీ, సమావేశానికి హాజరుకావొచ్చు. తీర్మానంపై తన అభిప్రాయాన్ని వెల్లడించొచ్చు. తీర్మానంపై సాధారణ సభ్యుడిగానే ఓటు వేయొచ్చు. కానీ, నిర్ణయాత్మక ఓటు ఉండదు. జీతభత్యాలు: స్పీకర్ జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీటిని రెండో షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం స్పీకర్‌కు వేతనం రూ.1,25,000. పదవీ విరమణ తర్వాత పెన్షన్, ఇతర అన్ని సౌకర్యాలుంటాయి. వీరి జీతభత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. పదవీకాలంలో వీరికి నష్టం వచ్చే విధంగా వేతనాలను సవరించరాదు. రాజీనామా: స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌కు సమర్పిస్తారు. స్పీకర్ అధికారాలు - విధులు స్పీకర్ అధికారాలు, విధులను రాజ్యాంగంలోని పార్లమెంటు కార్యకలాపాల నిర్వహణా చట్టంలోనూ పేర్కొన్నారు. వాటిని కింది విధంగా పేర్కొనవచ్చు.
పరిపాలన సంబంధిత అధికారాలు
ప్రత్యేక అధికారాలు
స్పీకర్ - స్థానం
|
Latest News
లోక్‌సభ స్పీకర్ అధికారాలు - విధులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment