Pages

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కొత్త‌ సిల‌బ‌స్ ఇదే: APPSC Group 2 New Syllabus 2023 Details

  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గ్రూప్-2 రాత పరీక్షలకు సంబంధించి తాజాగా కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రాథమిక (స్క్రీనింగ్) పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు  ప్రధాన పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు ఎంపికవుతారు. ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం... 150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌లో రెండు పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కులకు(మొత్తం 300) ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం.. పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్షావిధానం :

సబ్జెక్టు ప్రశ్నలుమార్కులు
ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర3030
భూగోళ శాస్త్రం3030
భారతీయ సమాజం3030
కరెంట్ అఫైర్స్3030
మెంటల్ ఎబిలిటీ3030
మొత్తం150150
​​​

మెయిన్స్‌ పరీక్ష విధానం

సబ్జెక్టుప్రశ్నలుసమయం
(నిమిషాల్లో)
మార్కులు
పేపర్-1(ఆంధ్రప్రదేశ్ సామాజిక,
సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం)
150150150
పేపర్-2(భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ,
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ)
150150150
మొత్తం300 300















No comments:

Post a Comment