Pages

GDS Results 2023: గ్రామీణ డాక్‌ సేవక్ ఫ‌లితాల రెండో జాబితా విడుద‌ల‌

 దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న‌ గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల రెండో జాబితాను ఇండియ‌న్ పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్ ఏప్రిల్‌ 12న విడుద‌ల చేసింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్య‌ర్థుల జాబితా అందుబాటులో ఉంది.

ఏప్రిల్‌ 21 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు
ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్‌ 21 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నియామక ఉత్తర్వులు అందుతాయి.

Telangana_DV_List2

Andhra Pradesh Circle - List II



No comments:

Post a Comment