సెప్టెంబరు - 12
|
భూగోళాన్ని పోలిన మరో గ్రహంపై నీటి జాడ ఉన్నట్టు లండన్ విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. అక్కడ జీవుల మనుగడకు అనుకూలమైన ఉష్ణోగ్రతలు ఉన్నట్టు అంచనాకు వచ్చారు. ఈ గ్రహం మన సౌర వ్యవస్థకు ఆవల, భూమికి 110 కాంతి సంవత్సరాల దూరాన ఉంది. భూమి కంటే 2.5 రెట్లు పెద్దదైన కె2-18బి అనే ఈ గ్రహంపై మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, ఒక చిన్న నక్షత్రం చుట్టూ అది తిరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడి వాతావరణంలో నీటి ఆవిరితో పాటు హైడ్రోజన్, హీలియం ఉన్నట్లు వివరించారు. కె2-18బి జీవనయోగ్య గ్రహం కాకపోవచ్చని మరికొందరు పరిశోధకులు భావిస్తున్నారు. భూమిని పోలిన గ్రహాలు విశ్వంలో మరెన్నో ఉన్నట్టు ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చినా, మరో గ్రహంపై నీటి జాడ, జీవన యోగ్య పరిస్థితులు ఉన్నట్టు గుర్తించడం మాత్రం ఇదే తొలిసారి.
|
Latest News
కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 12
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment