ఏపీ గ్రామ/వార్డు ‘సచివాలయ’ రాత పరీక్షల ఫలితాలు విడుదల

సెప్టెంబ‌ర్ 19వ తేదీ మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబరు 1 నుంచి 8 వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించి... కేవలం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. 

ఈ పరీక్షలకు 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబ‌ర్ 30వ తేదీ నుంచి అక్టోబర్‌ 1వరకు శిక్షణ ఇస్తారు. 

పరీక్షల నిర్వహణ విజయవంతం: 
  • 1.9.2019 నుంచి 8.9.2019 వ తేదీ వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఎంపిక పరీక్షలను 6 రోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
  • దేశ చరిత్రలోనే ఒకే రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేసేందుకు పోటీ పరీక్షలను ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఒక అరుదైన రికార్డు.
  • అభ్యర్థుల హాజరు: 19 రకాలయిన పోస్టులను భర్తీ చేయడానికి ఉద్దేశించిన 14 రకాల పరీక్షలకు మొత్తం 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు ఈ 19.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరు అయినారు.
  • పరీక్షలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించారు.

సమాధాన పత్రాల మూల్యాంకనం :
  • 19,50,630 మంది అభ్యర్ధులకు చెందిన ఓ ఎం ఆర్ సమాధాన పత్రాలను తేదీ 3.9.2019 నుండి 9.9.2019 వరకూ రికార్డు సమయంలో స్కాన్ పూర్తి చేయటం జరిగింది
  • స్కానింగ్ పూర్తి అయిన తరువాత వచ్చిన ఫలితాలను, ఈ రంగంలో నిష్ణాతులైన '' STATISTICAL TEAM” ద్వారా మరొకసారి సరి చూసుకోవటం కోసం STRATIFIED రాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో 10,000 ఓఎంఆర్‌ సమాధాన పత్రాలను సరి చూడడం జరిగింది. ముల్యాంకంలో ఎటువంటి తప్పులు దొర్లలేదని ధ్రువీకరించుకోవడం జరిగింది.







No comments:

Post a Comment