ఐటీడీఏ, పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ (82) హైదరాబాద్‌లో మరణించారు. ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి. వాటర్‌షెడ్ కార్యక్రమం, కరవు నివారణ పథకం, జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచారహక్కు చట్టం.. ఇలా అనేక కీలకమైన చట్టాలు,విధానాల రూపకల్పనలో యుగంధర్ పాత్ర ప్రత్యేకమైంది.పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యుగంధర్ ఆయనకు కార్యదర్శిగా పని చేశారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన యుగంధర్ 1962లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఏర్పాటులో కీలకపాత్ర పోషించి, ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2004లో కేంద్రంలో ఏర్పడిన యూపీయే ప్రభుత్వంలో ప్రణాళికా సంఘం సభ్యుడిగా పని చేశారు.
|
No comments:
Post a Comment