‘సచివాలయ’ అభ్యర్ధులకు సెప్టెంబర్ 21 నుంచి కాల్ లెటర్లు...

ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ రాతపరీక్షల ఫలితాల్లో జిల్లాలవారీగా మెరిట్ జాబితాలను వర్గీకరించి ఆయా ప్రాంతాలకు పంపారు.
Education Newsకలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)లు పోస్టుల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్ల ప్రకారం మెరిట్ అభ్యర్ధులకు కాల్ లెటర్లు పంపిస్తాయి. ఎంపికై న వారికి సెప్టెంబర్ 21, 22న కాల్ లెటర్లు అందుతాయి. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. సెప్టెంబర్ 23, 24, 25వ తేదీల్లో జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు జిల్లా యంత్రాంగం నిర్దేశించిన చోట హాజరు కావాలి.

ఉత్తీర్ణుల సంఖ్య కేటగిరీలవారీగా..
ఓపెన్
24,583
బీసీ
1,00,494
ఎస్సీ
63,629
ఎస్టీ
9,458
పరీక్షకు హాజరైన అభ్యర్థులు
19,50,630
ఉత్తీర్ణులు
1,98,164

కేటగిరీలవారీగా అభ్యర్థులు సాధించిన గరిష్ట మార్కులు: 
ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా
122.5
బీసీ కేటగిరిలో అత్యధికంగా
122.5
ఎస్సీ కేటగిరిలో అత్యధికంగా
114
ఎస్టీ కేటగిరిలో అత్యధికంగా
108
మహిళా అభ్యర్థుల్లో గరిష్టంగా
112.5
పురుష అభ్యర్థుల్లో గరిష్టంగా
122.5

ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా కలిపారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు కేటగిరీల వారీగా.. వర్గాల వారీగా పరీక్షలు రాసిన వారి సంఖ్య, ఉత్తీర్ణత సాధించిన వారి సంఖ్య ఈ విధంగా ఉంది...

Education News

No comments:

Post a Comment