కనీస అర్హత మార్కుల తగ్గింపు ఇప్పుడు లేనట్టే: ద్వివేది

ఆంద్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ విషయంలో కనీస అర్హత మార్కులు తగ్గింపుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ‘సాక్షి’కి చెప్పారు.
Education Newsరాతపరీక్షల ఫలితాల వెల్లడి అనంతరం పలు జిల్లాల్లో వివిధ పోస్టుల సంఖ్య కన్నా రాతపరీక్షలలో వివిధ కేటగిరీల్లో కనీస అర్హత మార్కులు సాధించిన వారి సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే, జిల్లాలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య కన్నా ఆ జిల్లాలో క్వాలిఫయింగ్ మార్కులు వచ్చిన వారు తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలన్న దానిపై 15 రోజుల తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. భర్తీ చేసే ఉద్యోగాలు ఎక్కువ ఉండి, కనీస మార్కులు తెచ్చుకున్న వారు తక్కువగా ఉన్నా ఇప్పుడు అర్హత మార్కులు తెచ్చుకున్న వారికే జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్లు పంపడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా వారీగా మిగిలి పోయే పోస్టుల సంఖ్యను సమీక్షించిన తర్వాత, ఆ పోస్టులకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలా.. లేదంటే ఇప్పుడు జరిగిన రాత పరీక్షల్లో మార్కులను తగ్గించి ఆ పోస్టులను భర్తీ చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తుదినిర్ణయం తీసుకుంటారన్నారు.

No comments:

Post a Comment