జాతీయ మానవ హక్కుల కమిషన్ :
జాతీయ మానవ హక్కుల కమిషన్ చట్టబద్ధమైన సంస్థ కానీ రాజ్యాంగ బద్ధమైన సంస్థ కాదు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం 1993 అక్టోబర్ 12న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది. |
2006 సంవత్సరంలో ఈ కమిషన్‌ను సవరించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
నిర్మాణం: ఇది బహుళ సభ్య సంస్థ. దీనిలో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు
పై సభ్యులతో పాటు మరో నలుగురు పదవి రీత్యా సభ్యులుగా ఉంటారు
నియామకం:
కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు. ఏది ముందైతే అది వర్తిస్తుంది. తొలగింపు: కమిషన్ చైర్మన్, సభ్యులను తొలగించే అధికారం రాష్ట్రపతి (యూపీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగించినట్లు) విధులు:
జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు:
ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా హద్యాల లక్ష్మీనారాయణ దత్తు (హెచ్.ఎల్. దత్తు) 2016 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి కొనసాగుతున్నారు.
జాతీయ ఎస్సీ కమిషన్ : పరిచయం: జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను విభజించి 2006 ఫిబ్రవరి 19వ తేదీన ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. కమిషన్ ప్రస్తుత చైర్మన్ - రాంశంకర్ కఠారియా నిర్మాణం: జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌లో ఒక ైచైర్మన్, వైస్ ైచైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇందులో ఒక మహిళ సభ్యురాలు తప్పనిసరి. నియామకం:కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను భారత రాష్ట్రపతి నియమిసారు. వీరు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారై ఉండాలి. పదవీ కాలం: జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ైచైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ప్రస్తుత కమిషన్ పదవీకాలం మూడేళ్లు. తొలగింపు: కమిషన్ చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి తొలగిస్త్తారు. విధులు:
జాతీయ ఎస్టీ కమిషన్: 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ 2004 సంవత్సరంలో ఏర్పడింది. ఇది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. రాజ్యాంగంలోని 338(ఎ) అధికరణ జాతీయ షెడ్యూల్డ్ తెగల గురించి తెలియజేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. రాజ్యాంగ పరంగా షెడ్యూల్డ్ తెగలకు కల్పించిన రక్షణలను పరిరక్షించడం దీని లక్ష్యం నిర్మాణం: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌లో ఒక ైచైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు ఇతర సభ్యులు ఉంటారు. వీరిలో ఒక మహిళ సభ్యురాలు తప్పనిసరి. వీరందరూ షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినవారై ఉండాలి. నియామకం: చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు, అలాగే రాష్ట్రపతికే వీరిని తొలగించే అధికారం ఉంటుంది. వీరి పదవీ కాలం మూడేళ్లు. విధులు:
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ :
ఇది ఒక బహుళ సమాఖ్య కమిషన్. ఇందులో ఒక చైర్మన్, ముగ్గురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. చైర్మన్, సభ్య కార్యదర్శులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. తొలగిస్తుంది. వీరి పదవీ కాలం మూడేళ్లు. ప్రస్తుతం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రస్తుత ఛైర్మన్ భగవాన్ లాల్ సాహ్ని. కమిషన్ విధులు:
జాతీయ మహిళ కమిషన్ : పరిచయం: జాతీయ మహిళ కమిషన్ చట్టం 1990 ప్రకారం జాతీయ మహిళ కమిషన్ 1992 జనవరి 31వ తేదీన ఏర్పడింది. ఇది శాసనబద్ధమెన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నిర్మాణం: జాతీయ మహిళా కమిషన్ బహుళ సభ్య సంస్థ. ఇందులో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. చైర్‌పర్సన్, సభ్యులకు మహిళ సమస్యలపై, న్యాయ శాస్త్రంలో , మహిళ సాధికారతపై పూర్తిగా అవగాహన ఉండాలి. కమిషన్‌లో ఒకరు ఎస్సీ, ఎస్టీ తెగలకు చెందిన వారై ఉండాలి నియామకం: కమిషన్ చైర్‌పర్సన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. తొలగిస్తుంది. పదవీకాలం: కమిషన్ చైర్‌పర్సన్, సభ్యుల పదవీ కాలం 3 ఏళ్లు. వీరు పదవీ కాలం కంటే ముందే రాజీనామా చే యవచ్చు. విధులు:
జాతీయ మహిళ కమిషన్ చైర్‌పర్సన్లు:
జాతీయ మైనార్టీ కమిషన్ : జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల(మైనార్టీ) కమిషన్ చట్టం 1992 ప్రకారం 17 మే 1993న ఏర్పడింది. ఇది శాసనబద్ధమైన సంస్థ కానీ రాజ్యాంగ బద్ధమైన సంస్థకాదు. అల్ప సంఖ్యాక వర్గాలకు కల్పించిన రక్షణలను పర్యవేక్షించడం దీని లక్ష్యం. ప్రస్తుత జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల కమిషన్ చైర్మన్ - సయ్యద్ గయోరల్ హసన్ రిజ్వి నిర్మాణం: జాతీయ అల్ప సంఖ్యా వర్గాల కమిషన్ బహుళ సభ్య సంఘం. ఇందులో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారు. కమిషన్ చైర్మన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వ నియమిస్తుంది. తొలగిస్తుంది. వీరి పదవీకాలం మూడేళ్లు, కేంద్ర ప్రభుత్వం ఆరు మతాలను అల్ప సంఖ్యాకులుగా గుర్తించింది.
జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్ : జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ 1988లో ఏర్పడింది. ఇది రాజ్యాంగ బద్ధమైన సంస్థకాదు. కానీ శాసనబద్ధమైన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నిర్మాణం: ఈ కమిషన్ బహుళ సభ్యత్వం కలిగి ఉంది. ఇందులో ఒక చైర్మన్, 10మంది సభ్యులు ఉంటారు. వీరందరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, తొలగిస్తుంది. వీరి పదవీకాలం 3 ఏళ్లు. విధులు:
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ : జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005 ప్రకారం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 2007లో ఏర్పడింది. ఇది రాజ్యాంగేతర సంస్థ. పార్లమెంట్ చట్టం ప్రకారం ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారిని బాలలుగా గుర్తిస్తారు. నిర్మాణం: కమిషన్‌లో చైర్మన్ , ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరిలో ఇద్దరు మహిళ సభ్యులు తప్పనిసరి. చైర్మన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. తొలగిస్తుంది. వీరి కాల పరిమితి మూడేళ్లు. విధులు:
|
Latest News
జాతీయ కమిషన్లు-విధులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment