మండల పంచాయతీని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నారు. గుజరాత్, కర్ణాటకల్లో ‘తాలూకా పంచాయతీ’ అని, మధ్యప్రదేశ్‌లో ‘జన్‌పథ్ పంచాయతీ’, తమిళనాడులో ‘పంచాయతీ సంఘ్’, అరుణాచల్ ప్రదేశ్‌లో ‘అంచల్ కమిటీ’, ఉత్తరప్రదేశ్‌లో ‘క్షేత్ర పంచాయతీ’, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘మండల పరిషత్’ అని వ్యవహరిస్తున్నారు.
|
మండల పరిషత్ నిర్మాణం
మధ్య స్థాయిలో గల స్థానిక సంస్థ ‘మండల పరిషత్’. ఇది స్థానిక సంస్థలకు సంబంధించి జనాభా, భౌగోళిక ప్రాతిపదికన విభజించిన భాగం. సాధారణంగా పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను మండలాలుగా విభజిస్తారు. అవి రెవెన్యూ పరంగా ఉంటాయి. కాబట్టి వాటిని రెవెన్యూ మండలాలు అంటారు. జిల్లాల్లో రెవెన్యూ మండల సరిహద్దులు, మండల పరిషత్ సరిహద్దులు ఒకే విధంగా ఉంటాయి. అయితే నగరాల్లో మాత్రం రెవెన్యూ మండలాల సంఖ్యకు, మండల పరిషత్‌ల సంఖ్యకు సంబంధం ఉండదు. నగరాల్లో రెవెన్యూ మండలాలు ఉంటాయి. కానీ, మండల పరిషత్తులు ఉండకపోవచ్చు. మండల పరిషత్‌లో సభ్యులు :
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యు(ఎంపీటీసీ)లను నేరుగా ఓటర్లు ఐదేళ్ల వ్యవధికి ఎన్నుకుంటారు. వీరి ఎన్నిక పార్టీ పరంగా జరుగుతుంది. సుమారు 3 వేల నుంచి 4 వేల జనాభా కలిగిన ప్రాంతాలను ఎంపీటీసీ స్థానాలుగా ఏర్పాటు చేస్తారు. ఒక మండలంలో కనిష్టంగా 7 ఎంపీటీసీ స్థానాల నుంచి గరిష్టంగా 23 స్థానాల వరకు ఉంటాయి. కో- ఆప్టెడ్ సభ్యులు: మైనారిటీ వర్గానికి చెందిన ఒక సభ్యుడిని తమకున్న ఎంపీటీసీ స్థానాలను బట్టి ఆయా పార్టీలు కో-ఆప్టెడ్ సభ్యుడిగా ఎన్నుకుంటాయి. హోదా రీత్యా సభ్యులు: సంబంధిత మండలంలో పూర్తిగా లేదా పాక్షికంగా తమ నియోజకవర్గ పరిధి విస్తరించి ఉన్న విధానసభ సభ్యుడు, లోక్‌సభ సభ్యుడు, ఆ మండలంలో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యుడు హోదా రీత్యా మండల పరిషత్‌లో సభ్యులుగా ఉంటారు. వీరికి మండలాధ్యక్షుడు, ఉప మండలాధ్యక్షుడి ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉండదు. శాశ్వత ఆహ్వానితులు: పై సభ్యులే కాకుండా మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా కింద పేర్కొన్నవారు హాజరవుతారు. వీరికి ఎలాంటి ఓటింగ్ హక్కులు ఉండవు. జిల్లా కలెక్టర్. మండల పరిషత్ పరిధిలోని గ్రామ పంచాయతీ సర్పంచులు. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు. జిల్లా పరిషత్ చైర్మన్. జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. ప్రత్యేక ఆహ్వానితులు : సంబంధిత మండల పరిషత్తులోని ఏదైనా రంగంలో విశేష అనుభవం ఉన్న వ్యక్తులను మండల పరిషత్ అధ్యక్షుడితో సంప్రదించి ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవొచ్చు. మండల పరిషత్ అధ్యక్ష/ఉపాధ్యక్షులుమండల పరిషత్‌కు అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఉంటారు. ఎంపీటీసీ సభ్యులు పార్టీ ప్రాతిపదికపై వీరిని ఎన్నుకుంటారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు. తొలగింపు, రాజీనామా: అవిశ్వాస తీర్మానం ద్వారా మండలాధ్యక్షుడిని, ఉప మండలాధ్యక్షుడిని తొలగించవచ్చు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై మొత్తం సభ్యుల్లో 50 శాతం సభ్యులు సంతకాలు చేసి ఆ నోటీసును సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారికి ఇవ్వాలి. మొత్తం సభ్యుల్లో మూడింట రెండు వంతులకు తగ్గని మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే వారు తొలగింపునకు గురవుతారు. ఈ ప్రక్రియలో ఎన్నికైన సభ్యులు (ఎంపీటీసీలు) మాత్రమే పాల్గొంటారు. అయితే ఎన్నికైన మొదటి నాలుగేళ్లలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు అవకాశం లేదు. రాష్ర్ట ప్రభుత్వం కూడా వీరిని అధికార దుర్వినియోగం, అవినీతి కారణాలపై తొలగించవచ్చు. మండల పరిషత్ అధ్యక్షుడు తన రాజీనామా పత్రాన్ని మండల పరిషత్‌కు సమర్పిస్తారు. అలా కాని పక్షంలో జిల్లా పంచాయతీ కార్యనిర్వహణ అధికారికి సమర్పిస్తారు. ఎంపీడీవో - అధికార విధులుమండల పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో). వీరిని రాష్ర్ట ప్రభుత్వం నియమిస్తుంది. గ్రూప్-1 సర్వీసుకు చెంది ఉంటారు. చట్టపరమైన విధులు
మండల పరిషత్‌లో పనిచేసే సిబ్బందిపై పరిపాలనా నియంత్రణ ఉంటుంది. నెలకు కనీసం రెండుసార్లు గ్రామాల్లో బస చేయాలి. అలాగే నెలకు 16 రోజులు మండల పర్యటన చేయాలి. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బీసీ హాస్టళ్లను తనిఖీ చేసే అధికారం ఉంటుంది. విద్యా సంబంధిత అధికారాలు :
మండల పరిషత్‌కు మండల మహాసభ సలహాపూర్వక అంగంగా వ్యవహరిస్తుంది. మండల పరిషత్తు పరిధిలో గ్రామ పంచాయితీ సర్పంచ్‌లు, మండల పరిషత్తు సభ్యులు ఉంటారు. దీని సమావేశాలకు మండల పరిషత్ అధ్యక్షుడు అధ్యక్షత వహిస్తారు. మండల మహాసభ.. మండల పరిషత్తుకు సంబంధించిన వార్షిక బడ్జెట్, ఆడిట్ నివేదిక, గత సంవత్సర వార్షిక బడ్జెట్, వార్షిక పరిపాలనా నివేదిక తదితర అంశాలను చర్చిస్తుంది. మండల పరిషత్తుకు, గ్రామాల మధ్య వారధిగా జిల్లా పరిషత్తు పనిచేస్తుంది. మండల పరిషత్తు అధికార విధులు
మండల పరిషత్‌కు కింది పద్ధతుల్లో ఆదాయం సమకూరుతుంది.
|
Latest News
స్థానిక సంస్థలు- మండల పరిషత్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment