సచివాలయ’ పరీక్షల్లో పాసైన వారి వివరాలతో పాటు.. జిల్లాల వారీగా షార్ట్‌లిస్టు జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లు సెప్టెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3: 30 గంటలకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
వెయిటేజీ మార్కులతో కలిపి అభ్యర్థులకు రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు ఆయా జిల్లా కలెక్టర్లకు సెప్టెంబర్ 20న చేరాయి. జిల్లాల వారీగా పోస్టులు, రిజర్వేషన్ల మేరకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ వాటిని పరిశీలించి ఉద్యోగాలకు అర్హులైన వారి వివరాలతో కూడిన షార్ట్‌లిస్టును సెప్టెంబర్ 23న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జాబితాలో పేరున్న వారికి జిల్లా సెలక్షన్ కమిటీ కాల్ లెటర్లను అభ్యర్థుల మెయిల్‌కు పంపిస్తారు.
No comments:
Post a Comment