ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కాల్ లెటర్‌లో పేర్కొన్న తేదీల్లో వివిధ కారణాలతో వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయినా, హాజరైనా అన్ని ఒరిజనల్స్ చూపలేకపోయినా.. వారికి రెండో ఛాన్స్ ఇవ్వాలని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ జిల్లా సెలక్షన్ కమిటీలను ఆదేశించారు.
రాత పరీక్షల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఆయా జిల్లాల్లో భర్తీ చేసే పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీలు షార్ట్ లిస్టు జాబితాలు తయారు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. సెప్టెంబర్ 21న శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలతో పాటు మరో రెండు మూడు జిల్లాల్లో షార్టు లిస్టులు విడుదల చేసి, ఎంపికై న అభ్యర్థుల మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్, ఈ మెయిల్ పద్ధతిలో సమాచారం పంపే కార్యక్రమం మొదలు పెట్టినట్లు తెలిపారు. షార్ట్ లిస్టులో పేరున్న వారు వారి కాల్ లెటర్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏ అభ్యర్థి ఏ రోజు, ఏ ప్రాంతంలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాని వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబరు 2వ తేదీ లోపే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. కాగా, షార్ట్ లిస్టుల తయారీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమంపై సెప్టెంబర్ 21న పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ జిల్లా సెలక్షన్ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.
No comments:
Post a Comment