1. విక్రమశిల విశ్వవిద్యాలయం స్థాపకుడెవరు? 1) ధర్మపాలుడు
2) హర్షుడు 3) లక్ష్మణసేనుడు 4) కుమారజీవుడు
2.కింది వాటిలో సరైన జత ఏది? 1) జైన మత విద్యా కేంద్రాలు - సరస్వతి గచ్ఛాలు
2) బౌద్ధ మత విద్యా కేంద్రాలు - ఆరామాలు 3) హిందూ మత విద్యా కేంద్రాలు - ఘటికలు 4) పైవన్నీ సరైనవే
3. నలందా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం పేరు? 1) రత్నసాగర్
2) పద్మనేత్ర 3) ధర్మగంజ్ 4) ఆనంద మండపం
4. ఎన్నాయిరం, త్రిభువనం (పుదుచ్చేరి)లలో విద్యా సంస్థలు స్థాపించిన చోళరాజు? 1) విజయాలయ చోళుడు
2) మొదటి రాజేంద్ర చోళుడు 3) పరాంతకుడు- I 4) కుళుత్తోంగ చోళుడు - I
5.‘ఆచార్య దేవోభవ’ అనే సూక్తి ఏ ఉపనిషత్తులో ఉంది? 1) బృహదారణ్యక ఉపనిషత్తు
2) తైత్తిరీయ ఉపనిషత్తు 3) కేనోపనిషత్తు 4) కఠోపనిషత్తు
6. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎప్పుడు జన్మించారు? 1) 1888 సెప్టెంబర్ 5
2) 1878 సెప్టెంబర్ 5 3) 1885 సెప్టెంబర్ 5 4) 1897 సెప్టెంబర్ 5
7. 1848లో జ్యోతీరావు పూలే తొలి బాలికల పాఠశాలను భారత్‌లో ఎక్కడ ఏర్పాటు చేశారు? 1) నాగ్‌పూర్
2) ఢిల్లీ 3) రాయ్‌ఘడ్ 4) పుణే
8. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? 1) తారాభాయి షిండే
2) అరుణా అసఫ్ అలీ 3) సావిత్రి భాయి పూలే 4) ఉన్నవ లక్ష్మీభాయమ్మ
9. భోజశాలలో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేసింది ఎవరు? 1) యశోవర్మ
2) ముంజరాజు 3) మిహిర భోజుడు 4) భోజరాజు
10. పల్లవుల కాలంలో ఘటికలకు కేంద్రం ఏది? 1) కంచి
2) మహాబలిపురం 3) మధురై 4) చిదంబరం
11. జతపరచండి.
జాబితా-I i) మద్రసా(బీదర్) ii) నలంద విశ్వవిద్యాలయం (రాజ్‌గిర్) iii) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బెనారస్) iv) రుషీ వ్యాలీ పాఠశాల (మదనపల్లె) జాబితా-II a) జిడ్డు కృష్ణమూర్తి ఛ) మదన్ మోహన్ మాలవ్యా c) కుమారగుప్తుడు d) మహ్మద్ గవాన్ 1) i-b, ii-d, iii-a, iv-c 2) i-c, ii-a, iii-d, iv-b 3) i-d, ii-c, iii-b, iv-a 4) i-a, ii-b, iii-c, iv-d
12. భారతదేశంలో విద్యాభివృద్ధికి బ్రిటిష్‌వారు 10 లక్షల రూపాయలను ఏ చట్టం ద్వారా కేటాయించారు? 1) 1813 చార్టర్ చట్టం
2) 1833 చార్టర్ చట్టం 3) 1853 చార్టర్ చట్టం 4) ఏదీకాదు
13. విద్యా సంస్థల్ని ఇన్స్పెక్టర్ ద్వారా తనిఖీ చేయించాలని సూచించిన హంటర్ కమిషన్‌ను నియమించిందెవరు?1) లార్డ్ డల్హౌసీ
2) లార్డ్ కానింగ్ 3) లార్డ్ లిట్టన్ 4) లార్డ్ రిప్పన్
14. ‘బేసిక్ ఎడ్యుకేషన్’ను గాంధీజీ ఎప్పుడు ప్రకటించారు? 1) 1927
2) 1931 3) 1937 4) 1942
15. బెనారస్లోని సంస్కృత కళాశాల స్థాపకులెవరు? 1) జోనాధన్ డంకన్
2) చార్లెస్ గ్రాంట్ 3) బైద్యనాథ్ ముఖర్జీ 4) డేవిడ్ హారే
16.‘భారత జాతీయ విద్యా దినోత్సవం’ ఎప్పుడు జరుపుకుంటారు? 1) ఆగస్ట్ 16
2) సెప్టెంబర్ 11 3) అక్టోబర్ 13 4) నవంబర్ 11
17. కింది వాటిలో సరైన జత ఏది? 1) 1882 - పంజాబ్ విశ్వవిద్యాలయం స్థాపన
2) 1887 - అలహాబాద్ విశ్వవిద్యాలయం స్థాపన 3) 1857 - కలకత్తా విశ్వవిద్యాలయం స్థాపన 4) పైవన్నీ
18. ఉపాధ్యాయ శిక్షణకు సంస్థలను నెలకొల్పాలని ప్రథమంగా చెప్పిన విద్యా ప్రణాళిక రూపకర్త? 1) చార్లెస్ వుడ్
2) థామస్ ర్యాలీ 3) అలెగ్జాండర్ డఫ్ 4) జోనాథన్ డంకన్
19.‘భారత జాతీయ విద్యా మండలి’ ఎప్పుడు ఏర్పడింది? 1) 1904
2) 1905 3) 1906 4) 1907
2) 1902
3) 1903 4) 1904
21.కాకతీయుల కాలంలో విద్యా మండపాలను గురించి పేర్కొనే శాసనం? 1) మల్కాపురం శాసనం
2) చందుపట్ల శాసనం 3) ద్రాక్షారామం శాసనం 4) త్రిపురాంతకం శాసనం
22. ‘విద్యార్థుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరిపించడమే గురువుల పరమావధి’ అని పేర్కొనే అశోకుని శిలా శాసనం? 1) కనగనహళ్లి శాసనం
2) బబ్రూ శాసనం 3) ఎర్రగుడిపాడు శాసనం 4) రాంపూర్వా శాసనం
23. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రధాన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? 1) ముంబాయి
2) పుణే 3) హైదరాబాద్ 4) నాగ్‌పూర్
24. సంతానం లేకుండా మరణించిన వారి ఆస్తి విద్యాలయాలకు చెందుతుందని ప్రకటించిన మొఘల్ రాజు? 1) అక్బర్
2) జహంగీర్ 3) షాజహాన్ 4) ఔరంగజేబు
25. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ఎవరి విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు? 1) ఎస్టీ
2) ఎస్సీ 3) బి.సి. 4) ఏదీకాదు
26. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? 1) కైరో
2) టోక్యో 3) న్యూయార్క 4) అబుదాబి
27. కలకత్తా విశ్వవిద్యాలయాని(1857)కి స్థల దాత ఎవరు? 1) మహారాజా వీరప్రతాప్ బహదూర్
2) మహారాణి దిద్దాదేవి 3) మహారాజా మహేశ్వరసింగ్ బహదూర్ 4) రాసమణీ దేవి
28. నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసిందెవరు? 1) మాలిక్ కాఫర్
2) నాదిర్షా 3) అహ్మద్‌షా అబ్ధాలీ 4) భక్తియార్ ఖిల్జీ
29. రుషీ వ్యాలీ పాఠశాలను జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడు స్థాపించారు? 1) 1919
2) 1921 3) 1926 4) 1929
30. మద్రాస్ రాష్ర్టంలో ఏర్పడిన ‘సెంట్రల్ కొలిజియేట్ ఇన్స్టిట్యూషన్’ అనే తొలి విద్యా సంస్థ ప్రారంభమైంది ఎప్పుడు? 1) 1841
2) 1843 3) 1846 4) 1848
31. కింది వాటిలో సరైన జత ఏది? 1) ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపన - 1926
2) శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన - 1954 3) ద్రవిడ విశ్వవిద్యాలయం స్థాపన - 1997 4) పైవన్నీ
32.రఘుపతి వెంకటరత్నం నాయుడు గురువు ఎవరు? 1) డాక్టర్ మిల్లర్
2) రెవరెండ్ నోబుల్ 3) హిండ్మన్ 4) మార్టీమర్ వీలర్
33. ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు కృషిచేసిన, జస్టిస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మద్రాస్ రాష్ర్ట విద్యాశాఖ మంత్రి? 1) సర్ విజయ
2) మాగంటి బాపినీడు 3) ఎ.పి.పాత్రో 4) సి.వై. చింతామణి
34. ‘అభినవ విద్యా భోజుడు’ అని కీర్తిగాంచినవారు? 1) ప్రతాపరుద్ర గజపతి
2) శివరామకృష్ణ మహేశ్వర ప్రసాద్ 3) విజయరామరాజు 4) ఆనందగజపతిరాజు
35. జతపరచండి.
తేది: i) ఆగస్టు 29 ii) సెప్టెంబర్ 19 iii) సెప్టెంబర్ 9 iv) ఏప్రిల్ 14 ప్రాధాన్యత: a) ప్రపంచ విజ్ఞాన దినోత్సవం b) తెలంగాణ భాషా దినోత్సవం c) తెలుగు మాధ్యమాల దినోత్సవం d) తెలుగు భాషా దినోత్సవం 1) i-b, ii-a, iii-d, iv-c 2) i-c, ii-d, iii-a, iv-b 3) i-d, ii-c, iii-b, iv-a 4) i-a, ii-b, iii-c, iv-d
36. ‘గణితసార సంగ్రహం’ గ్రంథాన్ని తెలుగులో రాసింది ఎవరు? 1) మారన
2) పావులూరి మల్లన 3) నన్నయ 4) నారాయణ భట్టు
37. తూర్పు చాళుక్యుల కాలంలో ప్రఖ్యాతి గాంచిన ఘటికా స్థానం (విద్యాలయం) అని ఏ దేవాలయానికి పేరు? 1) నొనంబేశ్వరాలయం
2) మార్కండేశ్వరాలయం 3) పార్థీశ్వరాలయం 4) గోలింగేశ్వరాలయం
38. ఆంధ్ర జాతీయ కళాశాల (మచిలీపట్నం)కు శంకుస్థాపన చేసింది? 1) సురేంద్రనాథ్ బెనర్జీ
2) బిపిన్ చంద్రపాల్ 3) లాలాలజపతిరాయ్ 4) కందుకూరి వీరేశలింగం
39.కింది వాటిలో అలంకార శాస్త్ర గ్రంథం ఏది? 1) నృత్యరత్నావళి
2) ప్రతాపరుద్ర యశోభూషణం 3) కుమార సంభవం 4) క్రీఢాభిరామం
40. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 1) ఆగస్ట్ 2
2) సెప్టెంబర్ 2 3) నవంబర్ 2 4) డిసెంబర్ 2
41. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ (ూఇఉఖఖీ) ఎప్పుడు స్థాపితమైంది? 1) 1957
2) 1959 3) 1961 4) 1972
42. ‘జామియా-మిలియా-ఇస్లామియా’ విద్యా సంస్థ ఏ స్వాతంత్రోద్యమ కాలంలో నిర్మితమైంది? 1) హోంరూల్ ఉద్యమం
2) సహాయ నిరాకరణోద్యమం 3) ఉప్పు సత్యాగ్రహం 4) క్విట్ ఇండియా ఉద్యమం
43. పెద కోమటి వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడు ఏ పదవిని అలంకరించారు? 1) న్యాయశాఖాధికారి
2) విద్యాశాఖాధికారి 3) కోశాధికారి 4) ఆర్థిక శాఖాధికారి
44.తెలుగు భాషలో జారీచేసిన తొలి శాసనం? 1) కళ్ళమళ్ల శాసనం
2) పోరుమావిళ్ల శాసనం 3) ద్రాక్షారామం శాసనం 4) ధర్మసాగరం శాసనం
45. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విద్యా సంస్థ ఏది? 1) గుజరాత్ విద్యాపీఠ్
2) కాశీ విద్యాపీఠ్ 3) బిహార్ విద్యాపీఠ్ 4) విశ్వభారతి విద్యా సంస్థ
46. భారత పార్లమెంట్ చట్టం ద్వారా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ (యూజీసీ) ఎప్పుడు ఏర్పడింది? 1) 1956
2) 1957 3) 1958 4) 1959
47. నలంద విశ్వవిద్యాలయాన్ని ఏ శతాబ్ధంలో స్థాపించారు? 1) క్రీ.శ.4
2) క్రీ.శ.5 3) క్రీ.శ.6 4) క్రీ.శ.7
48. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (1983) తొలి వైస్ చాన్స్‌లర్ ఎవరు? 1) కుముద్‌బెన్ జోషి
2) వి.ఎస్. రమాదేవి 3) వనజా అయ్యంగార్ 4) శాంతాసిన్హా
49. జైన విద్యా కేంద్రం ‘సరస్వతి గచ్ఛా’ను కొండకుందాచార్యులు ఎక్కడ నెలకొల్పారు? 1) గుంటుపల్లి
2) అమరావతి 3) కొనగండ్ల 4) వాకాడు
50. ‘వాణి నా రాణి’ అని అన్నది ఎవరు? 1) పిల్లలమర్రి పినవీరభద్రుడు
2) ధూర్జటి 3) అల్లసాని పెద్దన 4) తెనాలి రామలింగ కవి
51. చిత్తూరు జిల్లాలో సైనిక్ స్కూల్ ఎక్కడ ఉంది? 1) ఏర్పేడు
2) శ్రీకాళహస్తి 3) నారాయణవనం 4) కలికిరి
52. ‘మధురా విజయం’ రాసిన గంగాదేవి గురువు ఎవరు? 1) అత్రి
2) అగస్థ్యుడు 3) పిల్లలమర్రి పినవీరభద్రుడు 4) భట్టుమూర్తి
53. రామాయణ ఇతిహాసం ప్రకారం శ్రీరామ చంద్రుని గురువు ఎవరు? 1) అగస్థ్యుడు
2) భరద్వాజుడు 3) విశ్వామిత్రుడు 4) వశిష్ఠుడు
54.ద్రోణాచార్య అవార్డును ఏ రంగంలో ప్రతిభావంతులకు ఇస్తారు? 1) నావికా రంగం (కోచ్)
2) క్రీడా రంగం (కోచ్) 3) వైమానిక రంగం (కోచ్) 4) నాటక రంగం (శిక్షకుడు)
55. ‘సుహ్రుల్లేఖ’ గ్రంథాన్ని నాగార్జున కొండలో విద్యార్థులు వల్లెవేసేవారు అని రాసిందెవరు? 1) ఇత్సింగ్
2) పాహియాన్ 3) హుయాన్‌త్సాంగ్ 4) మార్కోపోలో
56. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ‘ఆంధ్ర విద్యా పీఠగోష్ఠి’ని ఎక్కడ ఏర్పాటు చేశారు? 1) సత్తెనపల్లి
2) నె ల్లూరు 3) చీరాల 4) బాపట్ల
57. దయానంద్ ఆంగ్లో-వేదిక్ కాలేజీని ఎక్కడ ఆర్య సామాజికులు స్థాపించారు? 1) పెషావర్
2) కరాచీ 3) లాహోర్ 4) ఇస్లామాబాద్
58. 1916లో డి.కె. కార్వే భారత్‌లోనే తొలి మహిళా విశ్వవిద్యాలయం ఎక్కడ నెలకొల్పారు? 1) నాగ్‌పూర్
2) ముంబై 3) ఢిల్లీ 4) పుణే
59.కలకత్తా విశ్వవిద్యాలయ చట్టాన్ని లార్డ కర్జన్ ఎప్పుడు రూపొందించారు? 1) 1902
2)1903 3) 1904 4) 1905
60. సహపంక్తి విద్యను ఆంధ్రలో ప్రారంభించినవారు? 1) కందుకూరి వీరేశలింగం
2) రఘుపతి వెంకటరత్నం నాయుడు 3) ఉన్నవ లక్ష్మీ నారాయణ 4) దుర్గాబాయి దేశ్‌ముఖ్
|
Latest News
భారతదేశ విద్యా వ్యవస్థ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment