1. జగన్నాథ రథయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగుతుంది?
1) జగన్నాథాలయం నుంచి గుండిచ దేవాలయం వరకు 2) జగన్నాథాలయం నుంచి కోణార్క సూర్యాలయం వరకు 3) జగన్నాథాలయం నుంచి లింగరాజస్వామి ఆలయం వరకు 4) గుండిచ దేవాలయం నుంచి జగన్నాథా లయం వరకు
2. మాలిక్ మహ్మద్ జాయసి ఎవరి గురించి గ్రంథం రాశారు? 1) రాణి సంయుక్త
2) రాణి పద్మిని 3) రాణి ధృవాదేవి 4) రాణి కుభేర నాగ
3. గుజరాత్ రాష్ర్ట పక్షి ఏది? 1) ఫ్లెమింగో
2) పాలపిట్ట 3) గిన్నెకోడి 4) పావురం
4. ‘పత్రిక స్వేచ్ఛ దినోత్సవం’ను ఎప్పుడు జరుపుకుంటారు? 1) మే 1
2) మే 3 3) మే 21 4) మే 27
5. కింది వాటిలో సరైన జత ఏది? 1. రత్న పాంచాలిక నాటకం - రెండో భూపాలుడు
2. మహానాటక సుధానిధి - రెండో దేవరాయలు 3. ప్రేమాభిరామం వీధి నాటకం-రావిపాటి త్రిపురాంతకుడు 4. పైవన్నీ
6. స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు పొందిన నిజాం ఎవరు? 1) నాసిరుద్ధౌలా
2) అఫ్జలుద్ధౌలా 3) మీర్ మహబూబ్ అలీఖాన్ 4) మీర్ ఉస్మాన్ అలీఖాన్
7. కాకతీయుల కాలంలో ఉన్న ‘జలకరండ’ అంటే ఏమిటి?
1) సంగీత వాయిద్యం 2) నీటిపన్ను 3) వ్యాకరణగ్రంధం 4) రోమ నివారిణి
8. గోండుల గ్రామదేవత ఎవరు? 1) రెమో
2) అకిపెన్ 3) దద్రీక 4) హమామ్
9.తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు? 1) భిల్లులు
2) యానాదులు 3) లంబాడీలు 4) సంతాలులు
10. గౌతమ బుద్ధుని పుట్టుకకు గుర్తు ఏమిటి? 1) కలువ పువ్వు
2) మల్లె పువ్వు 3) తామర పువ్వు 4) గుమ్మడి పువ్వు
11. ఫ్రాంకోయిస్ మార్టీన్ అభివృద్ధి చేసిన ప్రాంతం ఏది? 1) కోల్‌కత
2) గోవా 3) ముంబాయి 4) పుదుచ్చేరి
12.విప్రనారాయణ అనే పేరున్న ప్రబంధ గ్రంధం ఏది? 1) ఆముక్తమాల్యద
2) వైజయంతీ విలాసం 3) రాఘవ పాండవీయం 4) రాజశేఖర చరిత్ర
13. ‘మరాఠా మాఖియవెల్లి’గా ప్రసిద్ధి చెందింది? 1) బాలాజీ బాజీరావు
2) నానా ఫడ్నవీస్ 3) ఛత్రపతి సాహూ 4) సదాశివరావ్ భావే
14. వివాహ పన్నును రద్దు చేసిన విజయనగర రాజు ఎవరు? 1) శ్రీకృష్ణ దేవరాయలు
2) ఫ్రౌఢ దేవరాయలు 3) రెండో దేవరాయలు 4) సదాశివరాయలు
15. సింహాసనాన్ని త్యజించిన తొలి భారతీయ చక్రవ ర్తి ఎవరు? 1) చంద్రగుప్త మౌర్యుడు
2) అశోకుడు 3) బింబిసారుడు 4) బృహద్రదుడు
16.కింది వారిలో భారత్‌కు వచ్చిన విదేశీయుల్లో చైనాకు చెందని వారు ఎవరు? 1) పాహియాన్
2) సులేమాన్ 3) ఇత్సింగ్ 4) హుయాన్‌త్సాంగ్
17. కేరళ రాష్ర్ట పక్షి ఏది? 1) గ్రేట్ హార్నిబిల్
2) ఫ్లెమింగో 3) చిలుక 4) గద్ద
18. జాతీయ రహదారులను భారత్‌లో నిర్మించిన తొలి పాలకుడు ఎవరు? 1) బాబర్
2) హుమాయున్ 3) షేర్షా 4) అక్బర్
19. ‘చందమామ రావే... జాబిల్లి రావే...’ గేయకర్త ఎవరు? 1) యథావాక్కుల అన్నమయ్య
2) బమ్మెర పోతన 3) అల్లసాని పెద్దన 4) తాళ్లపాక అన్నమయ్య
20. చోళసముద్రం అని దేన్ని పిలుస్తారు? 1) హిందూ మహా సముద్రం
2) అరేబియా సముద్రం 3) బంగాళాఖాతం 4) నల్ల సముద్రం
21. భారత దేశానికి వచ్చిన ఇబన్బటూటా ఏ దేశానికి చెందిన వారు? 1) మొరాకో
2) ఈజిప్ట్ 3) వెనిస్ 4) నెదర్లాండ్
22. ఆంగ్లేయులు తొలి వర్తక స్థావరాన్ని దక్షిణాదిలో ఎక్కడ నెలకొల్పారు? 1) పాండిచ్చేరి
2) మద్రాస్ 3) మచిలీపట్నం 4) యానాం
23.భూదానోత్సవం పత్రిక ‘భూమిపుత్ర’ను ప్రారంభించిందెవరు? 1) మహదేవ్ దేశాయ్
2) మణిలాల్ గాంధీ 3) మొరార్జీ దేశాయ్ 4) నారాయణ దేశాయ్
24.భారతదేశ సైనిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 1) జనవరి 15
2) జనవరి 23 3) మార్చి 15 4) అక్టోబర్ 21
25. కింది వాటిలో సరికాని జత ఏది?
1. జైపూర్ - పింక్ సిటీ 2. ఉదయ్‌పూర్ - సిటీ ఆఫ్ లేక్స్ 3. మధురై - సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ 4. కోల్‌కత - సిటీ ఆఫ్ పెరల్స్
26.హుయాన్‌త్సాంగ్ రాసిన సీ.యూ.కీ. అనే చైనా భాషా గ్రంథాన్ని ఆంగ్లీకరించింది ఎవరు? 1) గ్రూసెట్
2) పారిట్జర్ 3) వాల్లర్స 4) అలెగ్జాండర్ రే
27. నరేంద్ర మృగరాజు 108 యుద్ధాలను ఎవరితో చేశాడు? 1) రాష్ర్టకూటులు
2) కాకతీయులు 3) పాండ్యులు 4) కాశ్మీర రాజులు
28. చాళుక్యుల కాలంలో పెళ్ళిళ్ల మీద విధించే పన్ను ఏది? 1) మేలివనం సుంకం
2) మదుమెయ సుంకం 3) నావిదదెరె సుంకం 4) అంగడిదెరె సుంకం
29. పల్లవుల కాలం నాటి ‘నెత్తురుకొడగు’ అంటే ఏమిటి? 1) యుద్ధాల్లో మరణించిన భటులకు భూమినిచ్చి వారి శిల ఉంచే ఆచారం
2) సతీ సహగమనం చేసిన స్త్రీలకు భూమి ఇచ్చి శిల ఉంచే ఆచారం 3) దేవాలయం నిర్మించే టప్పుడు చేసే వీరనృత్యం 4) ఏదీకాదు
30.యువరాజుకు పాలనలో అవకాశం కలిగించే పద్ధతిని ప్రారంభించిన చోళరాజు ఎవరు? 1) రాజరాజు-1
2) పరాంతకుడు-1 3) రాజేంద్ర-1 4) కుళుత్తోంగ చోళ-1
31.కాకతీయుల కాలంలో ప్రతి చెరువు గట్టు మీద ఏ దేవుని విగ్రహం ప్రతిష్టించేవారు? 1) ఇంద్రుడు
2) వరుణుడు 3) కుమారస్వామి 4) గణపతి
32.కింది వాటిలో సరైన జత ఏది? 1) కూన సముద్రం - కత్తుల పరిశ్రమ
2) మోటుపల్లి - విదేశీ వాణిజ్యం 3) ఓరుగల్లు - తివాచీలు 4) పైవన్నీ
33. జతపరచండి.
జాబితా -1 1. త్రిసముద్రాధిపతి 2. క్షత్రియదర్పమాన మర్ధన 3. కవివత్సలుడు 4. శతసహస్రహలదానక జాబితా -2 ఎ. శ్రీశాంతమూలుడు బి. హాలుడు సి. గౌతమీపుత్రశాతకర్ణి డి. యజ్ఞశ్రీ శాతకర్ణి 1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి 2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి 3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
34. కాకతీయుల కాలంలో బరువులను మోసే వారిని ఏమనేవారు? 1) సింగినాదం
2) పెరికలు 3) ఉప్పరలు 4) తెలికలు
35.‘ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్’ అని పిలిచే నగరమేది? 1) పుణె
2) కోల్‌కత 3) పాట్నా 4) లక్నో
36.సప్తగిరి (దూరదర్శన్) చానల్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? 1) తిరుపతి
2) విశాఖపట్నం 3) విజయవాడ 4) నెల్లూరు
37. షాజహాన్ బేగం ఏ సంస్థానాన్ని పాలించింది? 1) అయోధ్య
2) లక్నో 3) భోపాల్ 4) జైపూర్
38.దక్షిణ తీర రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు? 1) విశాఖపట్నం
2) కోల్‌కత 3) హాజీపూర్ 4) భువనేశ్వర్
39. భారతదేశ బొగ్గు రాజధాని అని పిలిచే ప్రాంతం ఏది? 1) సోనాపూర్
2) షోలాపూర్ 3) జబల్పూర్ 4) ధన్‌బాద్
40. ‘జయసంహిత’ అని ఏ గ్రంథాన్ని అంటారు? 1) రామాయణం
2) మహాభారతం 3) మనుచరిత్ర 4) ఆముక్తమాల్యద
41.కింది వాటిలో సరైన జత ఏది?
1) అమర్ సోనార్ బంగ్లా - రవీంద్రనాధ్ ఠాగూర్ 2) మా తెలుగు తల్లికి మల్లెపూదండ- శంకరంబాడి సుందరాచారి 3) జయజయహే తెలంగాణ - అంద్శై 4) పైవన్నీ
42. ‘నిగ్రందులు’ ఏ మతానికి చెందినవారు? 1) జైన మతం
2) బౌద్ధ మతం 3) సిక్కు మతం 4) పారశీక మతం
43.న్యాయ స్థానాల్లో మాతృభాష ఉపయోగించుకునే అవకాశం కల్పించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? 1) రాబర్టక్లైవ్
2) వారన్ హేస్టింగ్స 3) కారన్ వాలీస్ 4) విలియంబెంటిక్
44. కింది వాటిలో సరికాని జత ఏది? 1) ఒగ్గుకథ పిత- చుక్కా సత్తయ్య
2) ధ్వన్యనుకరణ పిత- నేరెళ్ల వేణు మాధవ్ 3) హరికథ పిత- షేక్ నాజర్ 4) ఆంధ్ర జాలరినృత్య పిత- డి.వై. సంపత్
45. నిజాం డిజైన్ చీరలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? 1) ఉప్పాడ
2) మంగళగిరి 3) ధర్మవరం 4) వెంకటగిరి
46. భరతముని అవార్డ్ ఏ రంగంలో నిపుణులకు ఇస్తారు? 1) క్రీడా రంగం
2) నృత్య రంగం 3) పత్రికా రంగం 4) శాస్త్ర, సాంకేతికరంగం
47. జైపూర్ ఫుట్ సృష్టికర్త ఎవరు? 1) విద్యాధర్ భట్టాచార్య
2) సుభాష్ చంద్రగార్గ 3) రోహిత్ పురోహిత్ 4) ప్రమోద్ కరణ్ సేథీ
48. క్రియాశక్తి పండితుడు ఎవరి కుల గురువు?
1) కాకతీయులు 2) రెడ్డిరాజులు 3) విజయనగర రాజులు 4) వేంగి చాళుక్యులు
49.కనిష్కుడు ఏ దేశంపై విజయం తర్వాత ‘దేవపుత్ర’ అనే బిరుదు పొందాడు?
1) చైనా 2) శ్రీలంక 3) జపాన్ 4) ఇండోనేషియా
50.జోగుల్ తంభి నాణేల నిధి నాణేలపై ఉన్న గుర్తులు ఎవరెవరి గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి? 1) నహపాణుడు, యజ్ఞశ్రీ శాతకర్ణి
2) గౌతమీపుత్ర శాతకరి,్ణ నహపాణుడు 3) శ్రీముఖుడు, కనిష్కుడు 4) గౌతమీపుత్ర శాతకర్ణి, హాలుడు
51.జతపరచండి.
1. కృతివాసుడు ఎ.తమిళ రామాయణం 2. తులసీదాస్ బి. తమిళ మహాభారతం 3. పెరుందేవనార్ సి. హిందీ రామాయణం 4. కంబన్ డి. బెంగాలీ రామాయణం 1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి 2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
52. కనిష్కుని మనుమడు హువిష్కుడు తన తాత విగ్రహాన్ని ఏ దేవాలయంలో ఏర్పాటు చేశాడు? 1) అయోధ్య
2) విదిశ 3) మధుర 4) ఉజ్జయిని
53. ఆటలదేవి మసీదు ఎక్కడ ఉంది? 1) గౌర్
2) నాడియా 3) శ్రీనగర్ 4) జాన్పూర్
54. ‘కశ్మీర్ అక్బర్’ అని ఎవరిని అంటారు? 1) హరిసింగ్
2) జైనుల్ అబిదిన్ 3) షేక్ అబ్దుల్లా 4) కుతుబ్ ఉద్దీన్ ఐబక్
55. ‘అభినవ పంప’ అని ఎవరిని పిలుస్తారు? 1) నాగ చంద్రుడు
2) కృతివాసుడు 3) కేతన 4) పాల్కురికి సోమనాథుడు
56. కోనసీమ చిత్ర కళా పరిషత్ ఎక్కడ ఉంది? 1) భీమవరం
2) సూళ్ళూరుపేట 3) అమలాపురం 4) తెనాలి
57. తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్ట్ ఎవరు? 1) రాంభట్ల కృష్ణమూర్తి
2) నార్ల వెంకటేశ్వరరావు 3) సత్యానంద్ 4) శ్రీధర్
58. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా..గతమెంతో ఘన కీర్తి గలవోడా..’ గేయకర్త ఎవరు? 1) బసవరాజు అప్పారావు
2) వేములపల్లి శ్రీకృష్ణ 3) గిడుగు రామమూర్తి 4) దర్శి చెంచయ్య
|
Latest News
భారతదేశ బొగ్గు రాజధాని అని పిలిచే ప్రాంతం ఏది?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment