Indian History Most Important Bits in Telugu-2020




గుప్తుల కాలంలో నిర్మించిన జంతర్‌మంతర్‌ ఎక్కడ కలదు?



1. ''ఫస్లీ'' అనే నూతన శకాన్ని ఆరంభించిన ప్రముఖ మొగల్‌ రాజు?
ఎ) హుమాయున్‌్‌ బి) అక్బర్‌
సి) జహంగీర్‌ డి) షాజహాన్‌
2. ''అక్బర్‌ చక్రవర్తిని'' భారత జాతీయపిత'' అని కొని యాడినవారు ఎవరు?
ఎ) సుభాష్‌చంద్రబోస్‌
బి) జవహర్‌లాల్‌ నెహ్రూ
సి) దాదాబారునౌరోజీ
డి) మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌
3. ''భువిలో స్వర్గం అంటూ వుంటే...అది ఇదే, అది ఇదే, అది ఇదే.. అని ఏ గోడలపై రాసి వున్నది?
ఎ) బులంద్‌ దర్వాజ బి) కుతుబ్‌ మినార్‌
సి) దివాన్‌-ఇ-ఖాస్‌ డి) తాజ్‌మహాల్‌
4. శివాజీ చేతిలో మరణించిన బీజాపూర్‌ సేనాని ఎవరు?
ఎ) షయిస్తాఖాన్‌ బి) అఫ్జల్‌ఖాన్‌
సి) జైసింగ్‌ డి) గార్గభట్టు
5. ''యునాని'' వైద్యాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు?
ఎ) అరబ్బులు బి) గ్రీకులు
సి) ఆంగ్లేయులు డి) పారశీకులు
6. ఈ కిందివారిలో ''కాలిగ్రఫీ''అనే రాత పద్ధతిలో ప్రసిద్దిగాంచిన మహిళ ఎవరు?
ఎ) గుల్‌బదన్‌బేగం బి) జహనార
సి) నూర్జహాన్‌ డి) జేబున్నీసా
7. ''తన రాజ్యంలో వారసులు లేకుండా విదేశీయులు మరణిస్తే వారి ఆస్తి మదర్సాలకు చెందుతుందని ప్రకటించిన మొగల్‌ రాజు ఎవరు?
ఎ) జహంగీర్‌ బి) అక్బర్‌
సి) ఔరంగజేబు డి) రెండోబహదూర్‌షా
8. ''తోప్రా, మీరట్‌ల నుండి అశోకుడి శిలాశాసనాలను ఢిల్లీకి తరలించిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు?
ఎ) బాల్బన్‌ బి) అల్లావుద్దీన్‌ఖిల్జీ
సి) ఇల్‌టుట్‌మిష్‌ డి) ఫిరోజ్‌షా తుగ్లక్‌
9. ఢిల్లీ సుల్తాన్‌ల కాలం నాటి ''వలి''లేదా ''ముక్తి'' విధి ఏమిటి?
ఎ) ఆర్థికమంత్రి
బి) న్యాయమంత్రి
సి) రాష్ట్రపాలన
డి) వ్యవసాయ శాఖ మంత్రి
10. ''సూఫీ''లో ఎన్ని శాఖలు వున్నాయని ''అబుల్‌ఫజల్‌'' అభిప్రాయపడెను?
ఎ) 9 బి) 11 సి)18 డి) 14
11. ఈ కిందివారిలో ''ఆగ్రా అంథకవి''గా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు?
ఎ) చింతామణి బి) తులసీదాస్‌
సి) సూరదాస్‌ డి) అన్నజీరావు
12. ప్రసిద్ధ కవి అమీర్‌ఖస్రు ఏ సూఫీ శాఖకు చెందిన వారు?
ఎ) సుహ్రవర్థీ బి) ఖాద్రీ
సి) నక్షబందీ డి) చిష్టి
13. పీష్వా పదవిని రద్దుచేసిన గవర్నర్‌ జనరల్‌ ఎవరు?
ఎ) మింట్‌ బి) ఇర్విన్‌
సి) హేస్ డి) రాబర్ట్‌ క్లైవ్‌
14. సాళువ నరసింహరాయులు ఆదరించిన తెలుగు కవి ఎవరు?
ఎ) అల్లసాని పెద్దన్న బి) శ్రీనాథుడు
సి) నందితిమ్మన
డి) పిల్లలమర్రి పినవీరభద్రుడు
15. కింది వారిలో వందేమాతరాన్ని ఆగ్లంలోకి అను వదించినవారు ఎవరు?
ఎ) ఆనంద్‌మోహన్‌బోస్‌ బి) సుభాష్‌చంద్రబోస్‌
సి) అరవిందఘోష్‌ డి) ఆర్నాల్డ్‌ ఎడ్విన్‌
16. భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణలర్పించిన తొలి ముస్లీం ఎవరు?
ఎ) ఇమ్రాన్‌ఖాన్‌ బి) అష్పకుల్లాఖాన్‌
సి) జిన్నా డి) రహీం చౌదరీ
17. దేశంలో తొలిసారిగా అరెస్ట్‌ అయిన బాలుడిగా స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో నిలిచిన వారు ఎవరు?
ఎ) మదన్‌లాల్‌ దింగ్రా
బి) ఓరుగంటి రామచంద్రయ్య
సి) షేక్‌ అబ్దుల్లా
డి) మాడపాటి హనుమంతరావు
18. ''సిన్‌ఫిన్‌'' ఉద్యమం ప్రేరణతో భారతదేశంలో జరిగిన ఉద్యమం ఏది?
ఎ) క్విట్‌ ఇండియా బి) సహాయ నిరాకరణ
సి)హోంరూల్‌ డి) దండి సత్యాగ్రహం
19. ''కాశీవిద్యాపీఠం' ఏ ఉద్యమ సమయంలో స్థాపించారు?
ఎ) దండి సత్యాగ్రహం
బి) బర్దోలి సత్యాగ్రహం
సి) వందేమాతర ఉద్యమం
డి) సహాయనిరాకరణ ఉద్యమం
20. ''భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశం'' మొదటి సారిగా దక్షిణ భారదేశంలో ఏ ప్రాంతంలో జరిగింది?
ఎ) కాకినాడ బి) విశాఖపట్నం
సి) మద్రాస్‌ డి) విజయవాడ
21. రాజాజీ ఫార్ములాను ఏ సం||లో రూపొందించారు?
ఎ) 1940 బి) 1944 సి) 1947 డి) 1951
22. త్రివర్ణ పతకాన్ని మేడం బికాజీకామా'' ఎక్కడ ఎరుగ వేశారు?
ఎ) జపాన్‌ బి) రష్యా
సి) జర్మనీ డి) ఇండియా
23. జామామసీదు ప్రార్థనలో పాల్గొన్న ఆర్యసమాజ్‌ నాయకుడు ఎవరు?
ఎ) స్వామీ శ్రద్దానంద
బి) దయానంద సరస్వతి
సి) విఠల్‌భారు
డి) స్వామీ రామానంద
24. సైమన్‌కమిషన్‌ కాలంలో మద్రాస్‌లో బ్రిటీష్‌ తూటా లకు బలైన యువకుడు?
ఎ) విక్రమ్‌ బి) పార్థసారది
సి) బసవన్న డి) రాజు
25. ''శాసనోల్లంఘన ఉద్యమ రాణి''గా ప్రసిద్ధి గాంచిన వారు ఎవరు?
ఎ) దుర్గాబారు దేశ్‌ముఖ్‌ బి) లక్ష్మిసెహగల్‌
సి) సరోజిని నాయుడు డి) అనిబిసెంట్‌
26. ఉన్నవ లక్ష్మీనారాయణ శారదానికేతన్‌ను ఎక్కడ స్థాపించెను?
ఎ) రాజమండ్రి బి) పెనుగొండ
సి) గుంటూరు డి) మచిలీపట్నం
27. ప్రిన్స్‌బరి నియోజకవర్గం నుంచి బ్రిటన్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌''కు ఎన్నికైనవారు?
ఎ) సురేంద్రనాధ్‌బెనర్జీ
బి) దాదాబారునౌరోజీ
సి) తిలక్‌
డి) ఆచార్యనరేంద్రదేవ్‌
28. ''ఫకీర్‌ మోహన్‌ సేనాపతి'' ఏ రాష్ట్రానికి చెందిన జాతీయ కవిగా ప్రసిద్దిచెందెను?
ఎ) ఒడిషా బి) హర్యాన
సి) గుజరాత్‌ డి) కేరళ
29. గాంధీజీ రాసిన ప్రముఖ గ్రంథాలు ఏవి?
ఎ) హిందూస్వరాజ్‌
బి) మైఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ట్రూత్‌
సి) ఎ.బి రెండూ డి) ఏదీ కాదు
30. అలీపూర్‌ కుట్ర కేసు నుండి అరవిందఘోష్‌ను నిర్ధోషిగా విడుదల చేయించినది ?
ఎ) ప్రకాశం బి) సి.ఆర్‌.దాస్‌
సి) భూలాభారుదేశారు డి) గాంధీ
31. ఈ కింది వాటిలో సింధు నాగరికతకు సంబంధిం చిన ప్రదేశాలలో అతి చిన్నది ఏది?
ఎ) కాలీభంగన్‌ బి) రూపార్‌ సి)అల్లాదినోV్‌ా డి)దోలవీర
32. ఈ కింది వాటిలో సింధూ నాగరికత కాలం నాటి ప్రజల ఆర్థిక ఆరాధ్య జంతువు?
ఎ) ఎద్దు బి) పులి సి) జింక డి) ఏనుగు
33. కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో సింధూ నాగరికతకు చెందిన శిథిలాలను కనుగొన్నారు?
ఎ) ఎథెన్స్‌ బి) దైమాబాద్‌ సి) పెర్సిపోలీస్‌ డి) ఫర్గానా
34. ఈ కింది వాటిలో ''దహిత్రి'' అను పదమునకు గల అర్థమేమిటి?
ఎ) వేదాలు చదివే బాల బ్రాహ్మణుడు
బి) శృంగారభరితమైన కోరిక
సి) బానిసకు బానిస
డి) పాలు పితికే అమ్మాయి
35. ''దుఖ: లేని అనంత సౌఖ్యం''ను జైనంలో ఏమంటారు?
ఎ) సల్లేఖనవ్రతం బి)శాద్వాదం
సి) శుద్దశీల డి)మహాపరినిర్వాణం
36. బుద్దుడి గుర్రమైన ''కంటకి పేరు మీద ఏ ఊరికి ఆ పేరు వుంది?
ఎ) ఘంటశాల బి) కనుపుశాల
సి) కందనవోలు డి)వేణికతటీపురం
37. ''ఆర్య'' అనగా అర్థమేమి?
ఎ) బ్రిటీష్‌ వారు బి) నల్లనివారు
సి) గౌవనీయమైన డి) తూర్పుతీరవాసులు
38. ఈ కింది వాటిలో ఇటుకలతో నిర్మించిన ఆలయం ఎక్కడ వుంది?
ఎ) బెనారస్‌ బి) బితర్‌గాల్‌
సి) దేవ్‌గడ్‌ డి) గుడిమల్లం
39. ''ఏడు పగోడాలు'' గల పల్లవుల కాలం నాటి పట్టణం/ ప్రాంతం ఏది?
ఎ) కంచి బి) మహాబలిపురం
సి) వారణాసి డి) పుదుక్కొటై
40. ''ఇండియన్‌ మాకియవెల్లిగా'' ప్రసిద్ధి గాంచిన వారు?
ఎ) అశోకుడు బి) కౌటిల్యుడు
సి) నాగార్జునుడు డి) కాళిదాసు
41. గుప్తుల కాలంలో నిర్మించిన''జంతర్‌మంతర్‌'' ఎక్కడ కలదు?
ఎ) ఉజ్జయినీ బి) బితర్‌గాల్‌
సి) బెనారస్‌ డి) పాటలీపుత్రం
42. ఈ కిందివాటిలో ''పరమేశ్వర'' బిరుదాంకితులు ఎవరు?
ఎ) కుమారగుప్త బి) రెండోపులకేశి
సి) మొదటి పులకేశి డి) హర్షుడు
43. లింగరాజు ఆలయం ఎక్కడ ఉంది?
ఎ) పూరి బి) కంచి
సి) మధురై డి) భువనేశ్వర్‌
44. ''సరస్వతి కంఠాభరణం'' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) మరమారభోజుడు బి) జయదేవుడు
సి) అమోఘవర్షుడు డి) లక్ష్మణసేనుడు
45. ఈ కింది వారిలో బాహుబలి విగ్రహాన్ని దక్షిణ భారతదేశంలో నిర్మించిన వారు ఎవరు?
ఎ) హర్షుడు
బి) చాముండరాయుడు
సి) రెండో పులకేశి
డి) మొదటి పులకేశి
46. సముద్రగుప్తుడు దండయాత్రలకై అనుసరించిన విధానం ఏది?
ఎ) మోక్షం బి) గ్రహణం
సి) అనుగ్రహం డి) పైవన్నీ
47. భారతదేశ ఖ్యాతిని, సంస్కృతిని ప్రపంచదేశాలకు పరిచయం చేసిన సాంస్కృతిక రాయబారులుగా ప్రసిద్ధి గాంచిన వారు కిందివారిలో ఎవరు?
ఎ) అరబ్బులు బి) గ్రీకులు
సి) పార్శీలు డి) యురోపియన్‌క్లబ్‌
48. ఏ ఢిల్లీ సుల్తాన్‌ కాలంలో ''నయా ముస్లీంలు'' భారత్‌లో స్థిరపడ్డారు?
ఎ)బాల్బన్‌ బి) జలాలుద్దీన్‌ ఖల్జీ
సి) ఇల్‌టుట్‌ మిష్‌ డి)రజియా
49. రాజ్య సంక్షేమం దృష్ట్యా 'తోట నాణేల'లను ప్రవేశ పెట్టిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు?
ఎ) బాల్బన్‌్‌ బి) అల్లావుద్దీన్‌ ఖిల్జీ
సి) మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌ డి) ఇల్‌టుట్‌ మిష్‌
50. ఏ బహమనీ సుల్తాన్‌ను''రెండో అరిస్టాటిల్‌''గా పిలిచేవారు?
ఎ) రెండో అహ్మద్‌్‌ బి) 3వ ఆహ్మద్‌షా
సి) హసన్‌గంగూ బహమన్‌షా డి) సయ్యద్‌షా
51. భారతదేశ చరిత్రలో ''దిగ్రేట్‌ కలకత్తా కిల్లింగ్‌''గా ప్రసిద్ధి చెందిన రోజు?
ఎ) 1940 ఆగస్టు16 బి) 1846 ఆగస్టు10
సి) 1946 ఆగస్టు16 డి) 1947 ఆగస్టు 16
52. ''మై రెమిని సెన్సెస్‌'' అనేది ఎవరి ఆత్మకథ?
ఎ) ఝాన్సీలక్ష్మీభాయి బి) గాంధీ
సి) ఠాగూర్‌ డి) అసఫ్‌ఆలీ
53. ''యాన్‌ ఇండియన్‌ పిలిగ్రిమ్‌'' గ్రంథాన్ని రచించిన వారు?
ఎ) నేతాజీ బి) తిలక్‌
సి) పూలే డి) అంబేద్కర్‌
54. లార్డ్‌ ఇర్విన్‌ పాలన కాలాన్ని గుర్తించండి?
ఎ)1920-26 బి) 1926-31
సి)1926-36 డి) 1925-1930
సమాధానాలు
1.బి 2.బి 3.సి 4.బి 5.ఎ
6.డి 7.ఎ 8.డి 9.సి 10.డి
11.సి 12.డి 13.సి 14.డి 15.సి
16.బి 17.బి 18.సి 19.డి 20.సి
21.బి 22.సి 23.ఎ 24 బి 25.సి
26.సి 27.బి 28.ఎ 29.సి 30.బి
31.సి 32.ఎ 33.బి 34.డి 35.సి
36.ఎ 37.సి 38.బి 39.బి 40.బి
41.ఎ 42.బి 43.డి 44.ఎ 45.బి
46.డి 47.ఎ 48.బి 49.సి 50.ఎ
51.సి 52.సి 53.ఎ 54.బి

No comments:

Post a Comment