ఏటా అక్టోబర్ 16న ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.

2020 సంవత్సరానికి సంబంధించి అందరూ కలిసి పెరగండి, పోషించండి, నిలబెట్టుకోండి. మన చర్యలే మన భవిష్యత్తు అనే థీమ్‌తో ముందుకు సాగుతోంది.
ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి ప్రతి వ్యక్తికి అవసరమైన పోషక ఆహారం అందే విధంగా చూడాల్సిన అవసరాన్ని ఈ థీమ్ హైలైట్ చేస్తుంది.
వివరాలు..
UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) అక్టోబర్ 16ను 1979లో ప్రపంచ ఆహార దినోత్సవంగా ఏర్పాటు చేసింది.
ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ వార్షికోత్సవంగా కూడా ఈ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా 130కి పైగా దేశాల్లో పనిచేస్తున్న ఎఫ్ఏయూ 2020కి గాను 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.
అందరికీ ఆహార భద్రత, ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా అందేలా చూడటం ఎఫ్ఏయూ లక్ష్యం.
No comments:
Post a Comment