భూకక్ష్య ఏ ఆకారంలో ఉంటుంది

 *11. భూకక్ష్య ఏ ఆకారంలో ఉంటుంది? దాని పొడవెంత?*


జ. దీర్ఘవృత్తాకారం, 965 మిలియన్ కి.మీ.


*12. భూమి సూర్యుని చుట్టూ ఓసారి తిరగడానికి పట్టే సమయం?*


జ. 365 రోజుల 6 గంటల 54 సెకన్లు, (365 1/4 రోజులు)


*13. సంవత్సరానికి 366 రోజులు ఉండే సంవత్సరాన్ని ఏమంటారు?*


జ. లీపు సంవత్సరం


*14. భూపరిభ్రమణం వల్ల ఫలితాలు?*


జ. పగలు, రాత్రి వేళల్లో తేడాలు, ఋతువులు ఏర్పడడం.


*15. భూపరిభ్రమణ సమయంలో భూమికి, సూర్యుడికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితిని ఏమంటారు?*


జ. అపహేళి


*16. భూమికి, సూర్యుడికి అత్యల్ప దూరం ఉండే స్థితి?*


జ. పరిహేళి


*17. భూమధ్యరేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడే రోజు?*


జ. మార్చి 21, సెప్టెంబర్ 23


*18. ‘విషవత్తులు’ అంటే?*


జ. రేయింబవళ్ళు సమానంగా ఉండే రోజులుః మార్చి 21, సెప్టెంబర్ 23


*19. జూన్ 21న సూర్యకిరణాలు లంబంగా పడే ప్రదేశం?*


జ. కర్కట రేఖ


*20. మకరరేఖపైన సూర్యకిరణాలు లంబంగా పడే రోజు?*


జ. డిసెంబర్ 22


*21. భూపరిభ్రమణం వల్ల ఋతువులు (కాలాలు) ఏర్పడ్డానికి ప్రధాన కారణం?*


జ. భూమి అక్షం 23 1/2° వాలి ఉండడం

No comments:

Post a Comment