ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లపై మార్చి 9వ తేదీన సచివాలయంలో వేర్వేరుగా సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాటినీ ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. ఎంపీడీవోల పదోన్నతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు.
No comments:
Post a Comment