బ్రిక్స్ సీసీఐ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియమితులైన క్రీడాకారిణి



వాణిజ్య ప్రోత్సాహక అంతర్జాతీయ సంస్థ బ్రిక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ(సీసీఐ) అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్ (2021–22)గా హైద‌రాబాద్‌కు చెందిన క్రీడాకారుడు సృష్టి జూపూడి నియమితులయ్యారు.

ఈ నియామకం ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది. సీసీఐ అంబాసిడర్‌గా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాదేశాల్లో ఎంఎస్‌ఎంఈ రంగంలోని వ్యాపారాలు, యువ, మహిళా వ్యాపారవేత్తలు, అంకుర సంస్థల ఏర్పాటులో జూపూడి కీలకపాత్ర పోషించనున్నారు.



సామాజిక మార్గం వైపు...

జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ప్రపంచ మాజీ ఛాంపియన్‌ సృష్టి జూపూడి పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ పొందారు. సంపూర్ణ నైపుణ్యం సాధించాలంటే పదివేల గంటల శిక్షణ అవసరం అని నిర్వచించే మాల్కమ్‌ గ్లాడ్‌వెల్‌ ‘10, 000గంటల నిబంధన’ను ఆమె సాధించారు. జూనియర్‌ విభాగంలో టాపర్‌గా ఉన్న సమయంలోనే బ్యాడ్మింటన్‌కు విరామమిచ్చి సామాజిక మార్గాన్ని ఎంచుకున్నారు.

No comments:

Post a Comment