ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 – మొత్తం వివరాలు
IB ACIO Recruitment 2025 : దేశ భద్రతా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నుంచి 2025 సంవత్సరానికి సంబంధించి 3717 ACIO-II/Executive ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు కేంద్ర హోంశాఖ ఆధీనంలో వస్తాయి. దేశ సేవ చేయాలనుకునే యువతకు ఇది అరుదైన అవకాశంగా చెప్పొచ్చు.
ఇది ఒక కంప్లీట్ గైడ్ – ఇందులో ఉద్యోగ వివరాలు, వేతన వివరాలు, అర్హతలు, వయసు పరిమితి, పరీక్షా విధానం, ఎంపిక విధానం, ఎలా దరఖాస్తు చేయాలో, ముఖ్యమైన తేదీలు అన్నీ ఉన్నాయి.
పోస్టు వివరాలు:
పోస్టు పేరు: Assistant Central Intelligence Officer Grade–II/Executive (ACIO-II/Exe)
జాబ్ కేటగిరీ: గ్రూప్ C (నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్)
జీతం: స్థాయి 7 – ₹44,900 నుండి ₹1,42,400 వరకు
జీతం అంతేనా? అదనపు అలవెన్సులు కూడా ఉన్నాయి:
డీఏ (53%): ₹23,797
Special Security Allowance (20%): ₹8,980
హౌస్ రెంట్ అలవెన్స్ (HRA): నగరానికి తగినట్టుగా 9% నుండి 27% వరకు
ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్: పెద్ద నగరాల్లో ₹3600, చిన్నవాటిలో ₹1800 + DA
పెన్షన్ కోసం ప్రభుత్వ NPS కాంట్రిబ్యూషన్: ₹6,286
ఇవి కాకుండా:
సెలవుల్లో విధులు చేస్తే నగదు రూపంలో రీమ్యూనరేషన్
వార్షిక వేతన పెంపు
మెడికల్ సదుపాయాలు (CGHS లేదా AMA ద్వారా)
LTC, పిల్లల విద్యా సాయం, ప్రభుత్వ క్వార్టర్స్ (అందుబాటులో ఉంటే) మొదలైనవి.
Vacancies వివరాలు – కేటగిరీల వారీగా
ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II పోస్టులకు మొత్తం 3717 ఖాళీలు ఉన్నాయి. వీటిలో:
OC కేటగిరీకి 1537 పోస్టులు ఇవ్వబడ్డాయి.
EWS కేటగిరీకి 442 ఖాళీలు ఉన్నాయి.
OBC కేటగిరీకి 946 పోస్టులు ఉన్నాయి.
SC కేటగిరీకి 566 ఉద్యోగాలు కేటాయించబడ్డాయి.
ST కేటగిరీకి 226 ఖాళీలు ఉన్నాయి.
అందరిలోనూ ఎక్కువ పోస్టులు OC కేటగిరీకే ఉన్నాయి. కాంపిటిషన్ గట్టిగానే ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వాలి.
అర్హతలు:
విద్యార్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి
కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
వయస్సు పరిమితి:
కనిష్టం: 18 సంవత్సరాలు
గరిష్టం: 27 సంవత్సరాలు
వయస్సు సడలింపులు (Age Relaxation) వివరాలు
ఈ ఉద్యోగానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్టంగా 27 సంవత్సరాలు. అయితే కొన్ని కేటగిరీలకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది:
SC మరియు ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది. అంటే వాళ్లు గరిష్టంగా 32 ఏళ్ల వరకూ అప్లై చేయవచ్చు.
OBC కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అంటే 30 ఏళ్ల వరకూ అప్లై చెయ్యొచ్చు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్లు, కనీసం 3 సంవత్సరాల సర్వీస్ ఉన్నట్లయితే, గరిష్ట వయస్సు 40 ఏళ్ల వరకూ ఉంటుంది.
విదవైనవారు లేదా విడాకులు తీసుకున్న మహిళలు – OC వాల్లకి గరిష్ట వయస్సు 35 ఏళ్లు, SC/ST వాల్లకి 40 ఏళ్ల వరకూ అనుమతి ఉంటుంది.
ఎక్స్-సర్వీస్మెన్లకు కూడా ప్రత్యేక వయస్సు సడలింపు ఉంటుంది, అది వారి సర్వీస్ పై ఆధారపడి ఉంటుంది.
2002 గుజరాత్ దంగల బాధితుల పిల్లలకు కూడా 5 ఏళ్ల వయస్సు రాయితీ ఉంటుంది.
ప్రతిభ కలిగిన క్రీడాకారులకు (నేషనల్/ఇంటర్నేషనల్ లెవల్ లో పాల్గొన్నవారికి) కూడా 5 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దివ్యాంగులకు ఈ పోస్టులు కాదు – అంటే వాళ్లు అప్లై చేయలేరు.
పరీక్షా కేంద్రాలు:
ప్రతి అభ్యర్థి 5 పరీక్షా నగరాలు ఎంపిక చేయాలి. అన్నీ రాష్ట్రాలు కవర్ అయ్యేలా భారీ లిస్టు ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలంగాణలో కూడా చాలా సెంటర్లు ఉన్నాయి:
ఆంధ్రప్రదేశ్: విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, కడప, కర్నూలు, కాకినాడ మొదలైనవి
తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ మొదలైనవి
పరీక్షా విధానం:
Tier-I (Objective Type)
మొత్తం ప్రశ్నలు: 100 (ప్రతి ప్రశ్న 1 మార్క్)
విషయాలు:
కరెంట్ అఫైర్స్
జనరల్ స్టడీస్
న్యూమరికల్ ఆప్టిట్యూడ్
లాజికల్ రీజనింగ్
ఇంగ్లీష్
సమయం: 1 గంట
నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్
Tier-II (Descriptive Paper)
ఎస్సే: 30 మార్కులు
ఇంగ్లీష్ కంప్రహెన్షన్, ప్రెసీ రైటింగ్: 20 మార్కులు
సమయం: 1 గంట
Tier-III (ఇంటర్వ్యూలోతో పాటు Aptitude/Psychometric test):
మొత్తం మార్కులు: 100
ఎంపిక విధానం:
Tier-I లో కటాఫ్:
UR – 35
OBC – 34
SC/ST – 33
EWS – 35
Tier-Iలో టాప్ స్కోరర్లలో టాప్ 10 రెట్లు అభ్యర్థులను Tier-IIకి పిలుస్తారు
Tier-I + Tier-II కలిపి స్కోరు ఆధారంగా 5 రెట్లు అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు
Tier-IIలో కనీసం 33% స్కోరు తప్పనిసరి (17/50)
Tier-I + Tier-II + Interview కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల అవుతుంది
అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ జరుగుతాయి
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 19 జూలై 2025
చివరి తేదీ: 10 ఆగస్టు 2025 (రాత్రి 11:59 వరకు)
ఫీజు చెల్లింపు (ఆన్‌లైన్): 10 ఆగస్టు 2025 లోపల
చలాన్ ద్వారా ఫీజు చెల్లించాలంటే: ఆన్‌లైన్ అప్లికేషన్ తర్వాత 4 రోజుల్లోగా బ్యాంకులో పేమెంట్ చేయాలి
దరఖాస్తు ఫీజు వివరాలు:
ప్రాసెసింగ్ ఛార్జ్: ₹450 (అందరికీ తప్పనిసరి)
ఎగ్జామ్ ఫీజు: ₹100 (UR, EWS, OBC only)
SC/ST, మహిళలు, నిరుద్యోగ మాజీ సైనికులు: కేవలం ₹450 మాత్రమే చెల్లిస్తారు
ఎలా అప్లై చెయ్యాలి?
అధికారిక వెబ్‌సైట్: www.mha.gov.in లేదా www.ncs.gov.in
స్టెప్-1: రిజిస్ట్రేషన్ – పేరు, మొబైల్, ఇమెయిల్
స్టెప్-2: పూర్తి డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్
ఫీజు చెల్లింపు: ఆన్‌లైన్ (UPI/Debit/Credit) లేదా చలాన్ ద్వారా
అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి
అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయలేరు
No comments:
Post a Comment