రైట్స్‌ లిమిటెడ్‌లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌ ఖాళీలు

RITES  Senior Technical Assistant Notification 2025 

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్ని్కల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (RITES) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 600 సీనియర్ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్‌ 14వ తేదీ నుంచి నవంబర్‌ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.


విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎస్‌ అండ్‌ టీ, మెకానికల్, మెటలర్జీ, కెమికల్, కెమిస్ట్రీ.
పోస్టు పేరు - ఖాళీలు
* సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌: 600
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిప్లొమా(ఇంజినీరింగ్‌)లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు.
జీతం: నెలకు రూ.29,735.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.300, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
దరఖాస్తు ప్రారంభ తేదీ: అక్టోబర్ 14.
ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్‌ 12.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు: దిల్లీ, గరుగ్రామ్‌, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, గువహటి, భువనేశ్వర్‌, హైదరాబాద్‌, భిలాయ్‌, చెన్నై, రాంచీ, అహ్మదాబాద్‌, పట్నా, లఖ్‌నవూ.
పరీక్ష తేదీ: 2025 నవంబర్‌ 23.

RITES Recruitment Notification

Official Website

No comments:

Post a Comment