ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులు అత్యధికంగా నమోదయ్యే దేశాల్లో 2017 సంవత్సరానికి భారత్ నాలుగో స్థానంలో నిలిచిందని లాన్సెట్ జర్నల్ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైనవాటిలో 4 శాతం భారత్‌లోనివేనని తెలిపింది. అన్ని దేశాల్లో కలిపి మొత్తం 21.90 కోట్ల మలేరియా కేసులు నమోదు కాగా భారత్‌లో కోటికి పైగా ఉన్నాయని వెల్లడించింది. భారత్ కంటే ముందు ఆఫ్రికా దేశాలైన నైజీరియా, కాంగో, మొజాంబిక్ ఉన్నాయి.
|
No comments:
Post a Comment