రేడియోలో క్రికెట్ కామెంట్రీ వినిపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఆలిండియా రేడియో (ఏఐఆర్)తో రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లతోపాటు దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లపై లైవ్ కామెంట్రీ ప్రసారం చేస్తారు. సెప్టెంబరు 15న దక్షిణాఫ్రికాతో జరిగే తొలి వన్డేతో ఈ కామెంట్రీ మొదలుకానుంది. పశ్చిమాసియా యూత్ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-12 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిలుకూరి సాయి వర్షిత్ స్వర్ణం గెలుచుకున్నాడు. దిల్లీలో జరిగిన ఈ టోర్నీలో అగ్రస్థానంలో నిలిచి ఫిడె మాస్టర్ (ఎఫ్‌ఎం) టైటిల్‌నూ దక్కించుకున్నాడు.రష్యాలోని వ్లాదివొస్తోక్‌లో జరుగుతున్న ఆసియా పసిఫిక్ యూత్ క్రీడల చెస్‌లో బాలుర విభాగంలో హైదరాబాద్‌కు చెందిన కుశాగ్ర మోహన్ స్వర్ణం సాధించాడు. ఈ టోర్నీలో చెస్‌తోపాటు జూడో, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో పాల్గొన్న భారత క్రీడాకారులు మొత్తం 16 స్వర్ణాలు దక్కించుకున్నారు.
|
No comments:
Post a Comment