కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 10

సెప్టెంబరు - 10

¤ తెలంగాణ గవర్నర్‌గా సెప్టెంబరు 8 ప్రమాణం చేసిన తమిళిసైసౌందరరాజన్‌ (58 ఏళ్లుదేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైనగవర్నర్‌గా నిలిచారుఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌హరిచందన్‌ (85) దేశంలోనే పెద్ద వయస్కుడైన గవర్నర్‌గాఉన్నారు.
¤ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫ్లోరిడా స్టేట్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టున్యాయమూర్తి పదవికి భారత సంతతికి చెందిన అనురాగ్‌ సింఘాల్‌పేరును ప్రతిపాదించారుఫ్లోరిడాలో  పదవికి నామినేట్‌ అయినతొలి భారత సంతతి న్యాయవాదిగా సింఘాల్‌ ప్రత్యేకత సాధించారు.
¤ చైనాకు చెందిన ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అలీబాబా గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు, కంపెనీ ఛైర్మన్‌ జాక్‌ మా పదవి నుంచి తప్పుకున్నారు. తన 55వ పుట్టినరోజున పదవి నుంచి వైదొలుగుతానని ఆయన ముందే ప్రకటించారు. ఛైర్మన్‌ పదవి వీడినా అలీబాబా పార్ట్‌నర్‌షిప్‌ గ్రూప్‌లో సభ్యుడిగా కొనసాగుతారు. వృత్తిరీత్యా ఆంగ్ల టీచర్‌ అయిన జాక్‌ మా 1999లో ఇ-కామర్స్‌ రంగంలోకి ప్రవేశించి, అలీబాబాను స్థాపించారు. ఈ సంస్థ అనతికాలంలోనే బిలియన్‌ డాలర్ల కంపెనీగా అవతరించింది. 2013లో సీఈఓ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన జాక్‌ మా సంపద ప్రస్తుతం 41.8 బిలియన్‌ డాలర్లు

No comments:

Post a Comment