సెప్టెంబరు - 12
|
కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మ విభూషణ్‌కు ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ పేరును సిఫారసు చేసింది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు షట్లర్ పి.వి. సింధును పద్మభూషణ్‌కు నామినేట్ చేసింది. మేరీకోమ్‌కు 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ ప్రకటించారు. సింధు 2015లో పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఆమె పేరును 2017లోనే పద్మభూషణ్‌కు సిఫారసు చేసినా, తుది జాబితాలో స్థానం లభించలేదు. తాజాగా ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్, హాకీ ఒలింపియన్ గణేశ్, మరో ఏడుగురు క్రీడాకారిణుల పేర్లను పద్మశ్రీకి నామినేట్ చేశారు. రెజ్లర్ వినేశ్ ఫోగట్, మనికా బాత్రా (టీటీ), క్రికెటర్ హర్మన్‌ప్రీత్‌కౌర్, జాతీయ మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్, మాజీ షూటర్ సుమ షిరుర్, పర్వతారోహక సోదరీమణులు తషి, నుంగ్లీ మాలిక్‌ల పేర్లను పద్మశ్రీకి సిఫారసు చేసింది. ఈ జాబితాకు క్రీడల శాఖా మంత్రి కిరణ్ రిజిజు, అవార్డుల కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. 2020 గణతంత్ర దినోత్సవం రోజు పద్మ అవార్డు విజేతల పేర్లను ప్రకటిస్తారు.
¤ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్మారకార్థం న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కొట్లా మైదానం పేరును అధికారికంగా అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంగా మార్చారు. ఈ సందర్భంగా దిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఆధ్వర్యంలో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ నామకరణ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా 14 ఏళ్లపాటు పని చేశారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ ఆయన వ్యవహరించారు. స్టేడియంలోని ఒక స్టాండ్‌కు భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ పేరు పెట్టారు. ¤ ఝార్ఖండ్‌లో రూ. 465 కోట్లతో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనాన్ని, మల్టీ మోడల్ కార్గో టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దుకాణదారుల కోసం ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్ ధన్ యోజన, స్వయం ఉపాధిదారుల కోసం స్వరోజ్‌గార్ పింఛన్ పథకాలను ఈ సందర్భంగా ఆయన ఆరంభించారు. |
Latest News
కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 12
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment