సెప్టెంబరు - 12
|
ఆదాయపు పన్ను చెల్లింపుదార్ల కోసం ప్రతిష్ఠాత్మక ఈ-అసెస్‌మెంట్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్నే ఫేస్‌లెస్ లేదా నేమ్‌లెస్ అసెస్‌మెంట్‌గానూ పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గెజిట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ పథకం కింద జాతీయ ఇ-అసెస్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. పన్ను మదింపు విషయంలో సమస్యలు గుర్తిస్తే, అలాంటి పన్ను చెల్లింపుదార్లకు ఈ కేంద్రం నుంచి నోటీసులు అందుతాయి. 15 రోజుల్లోగా వారి నుంచి స్పందన అందుకున్నాక, ఆటోమెటిక్ వ్యవస్థ ద్వారా ఆ కేసును అసెసింగ్ అధికారికి అప్పగిస్తారు. ఈ కొత్త విధానం అక్టోబరు 8న ప్రారంభమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
|
Latest News
కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 12
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment