తెలంగాణలో నాలుగైదు నెలలుగా కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తుది ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్ పీఆర్‌బీ) సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 11 గంటలకు ఫలితాలను విడుదల చేసింది.
ఇప్పటికే విడుదలైన రాతపరీక్షలో 90 వేలమంది అభ్యర్థులు అర్హత సాధించారు. తాజాగా విడుదల చేసిన తుది ఫలితాల్లో సివిల్, ఏఆర్, టీఎస్ ఎస్పీ, ఫైర్, ప్రిజన్స్, డ్రైవర్స్ తదితర విభాగాల ఫలితాలకు కలిపి మొత్తంగా 17,156 మంది ఎంపికై నట్లు టీఎస్‌ఎల్ పీఆర్‌బీ చైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు. వీరిలో 13,373 మంది పురుషులు కాగా 2,652 మంది మహిళలున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఏమైనా అభ్యంతరాలుంటే... సెప్టెంబర్ 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 7 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు స్థానిక ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.1,000 ఇతరులు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు https://www.tslprb.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
No comments:
Post a Comment