‘సచివాలయ’ ఉద్యోగాల సర్టిఫికెట్ల పరిశీలనకు ఇవి తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్‌ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు... జిల్లాల్లో ఏర్పాటు చేసే కేంద్రాలకు కింది ధ్రువపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుంది.
Education Newsసర్టిఫికెట్ల పరిశీలనకు ఇవి తప్పనిసరి: 
  • అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రం.
  • ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం.
  • ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు.
  • నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఎక్కడ చదివారన్న వివరాలతో స్టడీ సర్టిఫికెట్లు.
  • స్కూలు, కాలేజీల్లో చదవకుండా డైరెక్ట్‌ డిగ్రీ వంటి కోర్సులు చేసిన వారి నివాస ధ్రువీకరణ పత్రం.
  • రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్‌ మేరకు తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి స్థానికత మార్చుకున్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్‌.
  • చెవిటి, మూగ వైకల్యంతో ప్రత్యేక స్కూళ్లలో చదువుకున్న వారు.. వారి తల్లిదండ్రుల నివాసిత ధ్రువీకరణ పత్రం.
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం.
  • బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్‌ జారీ చేసిన నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌.
  • దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన మెడికల్‌ సర్టిఫికెట్‌.
  • ఎక్స్‌ సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ, క్రీడల కోటా అభ్యర్థుల సంబంధిత సర్టిఫికెట్లు.
  • ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొంది.. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారు తమ శాఖాధిపతి నుంచి పొందిన ఇన్‌ సర్వీసు సర్టిఫికెట్‌.
  • తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీ. దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

సర్టిఫికెట్ల జారీలో ఇబ్బందులు పెట్టకుండా ఆదేశాలు : ఉద్యోగాలకు ఎంపికైన వారికి అవసరమైన సర్టిఫికెట్లను తహసీల్దార్లు వెంటనే జారీ చేసేలా జిల్లా కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బీసీ అభ్యర్థులు తాజాగా క్రిమిలేయర్‌ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉందని, వాటితో పాటు అవసరమైన వారికి నివాసిత, కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో ఎలాంటి ఇబ్బందులు రానీయవద్దని సూచించింది.

No comments:

Post a Comment