కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 6

సెప్టెంబరు - 6

రాష్ట్రీయం (ఏపీ)¤ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాణ్యమైన బియ్యం పంపిణీని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రారంభించారు. ఉద్దానం మంచినీటి పథకం, కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు.¤ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు స్వచ్ఛ మహోత్సవ్‌ పురస్కారాలు లభించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఈ అవార్డులను ప్రదానం చేశారు.
¤ కడప జిల్లా వేముల మండలం ఎం.తుమ్మలపల్లెలోని యురేనియం శుద్ధి కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాల వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిపుణుల కమిటీని నియమించింది. సెప్టెంబరు 9, 10 తేదీల్లో కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, 11న నివేదిక సమర్పించనుంది.
రాష్ట్రీయం (టీఎస్‌)¤ దేశవాళీ ఆవుల పెంపకం, సంరక్షణకు కేంద్రం గోకుల్‌ గ్రామ్‌ పథకం కింద తెలంగాణకు రూ.5.37 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ‘గోకుల్‌ గ్రామ్‌' ఏర్పాటు చేసి, దేశవాళీ జాతులకు చెందిన 500 ఆవులను పెంచనున్నారు.

No comments:

Post a Comment