యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కి చెందిన గడ్డం మోహన్‌రావు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని స్వీకరించారు. అసోంలోని డిబ్రూగఢ్‌లో జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర కంబార ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. చిందుల జీవన సంస్కృతి, సంప్రదాయాలు ఇతివృత్తంగా మోహన్‌రావు రాసిన ‘కొంగవాలు కత్తి' అనే నవలకు ఈ పురస్కారం దక్కింది. అవార్డు కింద రూ. 50 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంస పత్రం అందజేశారు.రానున్న అయిదేళ్లలో మౌలిక వసతులు కల్పించడానికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయాలని సంకల్పించిన కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు చేపట్టాలనే ప్రాధాన్య క్రమాన్ని నిర్ధారించడానికి కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నాయకత్వం వహిస్తారు. ఈ దళంలో నీతి ఆయోగ్ సీఈఓ, ఆర్థిక శాఖ వ్యయ కార్యదర్శి లేదా అతని నామినీ, మౌలిక వసతుల కల్పనతో సంబంధం ఉన్న వివిధ శాఖల కార్యదర్శులు, ఆర్థిక శాఖలో పెట్టుబడుల విభాగం అదనపు కార్యదర్శి, మౌలిక వసతుల విధానం, ఆర్థిక విభాగం సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. రూ.100 కోట్లకు మించి పెట్టుబడి పెట్టే ప్రాజెక్టుల ప్రాధాన్యతా క్రమాన్ని ఇది నిర్ధారిస్తుంది. ఈ కార్యదళం 2019-20లో చేపట్టాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన నివేదికను అక్టోబరు 31కల్లా సమర్పిస్తుంది. 2021-25 మధ్య కాలంలో చేపట్టాల్సిన ప్రాజెక్టుల గురించి డిసెంబరు 31కల్లా నివేదిక అందిస్తుంది.
|
No comments:
Post a Comment