సెప్టెంబరు - 8
రాష్ట్రీయం (తెలంగాణ)
¤ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. ఆమె రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈ పదవి చేపట్టిన రెండో వ్యక్తిగానూ నిలిచారు. ¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గత అయిదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) బ్యాంకులు రైతులకు రూ.14,137 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ తాజాగా వెల్లడించింది. ¤ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటు కల్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలలకు మంత్రివర్గం పూర్తిస్థాయిలో కొలువుతీరినట్లైంది. మొత్తం 18మందికి అవకాశం ఉండగా తొలుత 12 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇద్దరు మహిళలకు ఈసారి క్యాబినెట్‌లో స్థానం దక్కింది. తాజాగా మంత్రివర్గంలో చేరినవారు: తన్నీరు హరీశ్‌రావు, కల్వకుంట్ల తారక రామారావు, పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, సత్యవతి రాఠోడ్. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం* ముఖ్యమంత్రి కేసీఆర్: నీటిపారుదల, రెవెన్యూ, సాధారణ పరిపాలన, ప్రణాళిక, గనులు, శాంతి భద్రతలు* మహమూద్ అలీ: హోం * కల్వకుంట్ల తారక రామారావు - ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి * తన్నీరు హరీశ్‌రావు - ఆర్థికశాఖ * అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి: అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ, న్యాయ* తలసాని శ్రీనివాస యాదవ్: పశు సంవర్థకం, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ* గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి: విద్యుత్* ఈటల రాజేందర్: వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం* సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి: వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్* కొప్పుల ఈశ్వర్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ, వికలాంగుల, వృద్ధుల సంక్షేమం* ఎర్రబెల్లి దయాకర్‌రావు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా* వి. శ్రీనివాస్‌గౌడ్: ఆబ్కారీ, క్రీడలు, యువజన సేవలు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు* వేముల ప్రశాంత్‌రెడ్డి: రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహనిర్మాణం* చామకూర మల్లారెడ్డి: కార్మిక ఉపాధి, కర్మాగారాలు, ఉపాధి కల్పన* పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి - విద్యా శాఖ * గంగుల కమలాకర్ - బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు* సత్యవతి రాఠోడ్ - గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ* పువ్వాడ అజయ్ కుమార్ - రవాణా శాఖ
No comments:
Post a Comment