¤ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కెనడాకు చెందిన 19 ఏళ్ల బియాంకా వానెస్సా ఆండ్రిస్కూ దక్కించుకుంది. ఫైనల్లో ఆమె సెరెనా విలియమ్స్‌ను ఓడించింది. గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి కెనడా క్రీడాకారిణిగా నిలిచిన ఆండ్రిస్కూ కెరియర్‌లో యూఎస్ ఓపెన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీ. అత్యంత వేగంగా గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన మోనికా సెలెస్ రికార్డును ఆమె సమం చేసింది. సెలెస్ తన నాలుగో మేజర్ టోర్నీలో, 1990లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. గతేడాది సింగిల్స్‌లో ఆండ్రిస్కూ ర్యాంక్ 208. ప్రతిష్ఠాత్మక రోజర్స్ కప్ గెలుచుకున్న ఆమె ఇండియన్ వెల్స్ టోర్నీలో వీనస్, వోజ్నియాకి, కెర్బర్ లాంటి ప్రముఖ క్రీడాకారిణులను ఓడించి, ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరుకుంది (తాజా విజయంతో ఆమె అయిదో స్థానానికి చేరనుంది).» విజేత ఆండ్రిస్కూకి రూ.27.58 కోట్లు, రన్నరప్ సెరెనాకు రూ.13.61 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది.» స్వెత్లానా కుజ్‌నెత్సొవా (2004 - యూఎస్ ఓపెన్) తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా ఆండ్రిస్కూ రికార్డు నెలకొల్పింది.» 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఆల్‌టైమ్ గ్రేట్ మార్గరెట్ కోర్ట్ సరసన నిలవాలని కోరుకున్న అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు నిరాశ మిగిలింది. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాక గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఓడిపోవడం సెరెనాకు ఇది వరుసగా నాలుగోసారి.¤ ఇటలీలోని మోంజాలో జరిగిన ఇటలీ గ్రాండ్ ప్రిలో చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ) టైటిల్ గెలుచుకున్నాడు. తాజా విజయంతో ఫెరారీ జట్టుకి సొంతగడ్డపై తొమ్మిదేళ్ల తర్వాత టైటిల్ దక్కింది.
|
No comments:
Post a Comment