కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 8

సెప్టెంబరు - 8
చంద్రయాన్‌-2 లోని విక్రమ్‌ ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై గుర్తించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు. దీంతో చందమామపైకి చేరిన నాలుగో దేశంగా, దక్షిణ ధ్రువాన్ని అందుకున్న తొలి దేశంగా భారత్‌ ఘనత సాధించినట్లయ్యింది. చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్‌ విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీని గుర్తించి, థర్మల్‌ ఇమేజ్‌ తీసినట్లు శివన్‌ వెల్లడించారు. ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని మృదువుగా కాక గట్టిగా ఢీకొందని భావిస్తున్నారు. ప్రజ్ఞాన్‌ రోవర్‌ ల్యాండర్‌లోనే ఉండిపోయింది.

No comments:

Post a Comment