కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 9

సెప్టెంబరు - 9
రాష్ట్రీయం (తెలంగాణ)¤ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2019-20కి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్‌ వ్యయం: రూ.1,46,492.3 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,11,055 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లుగా ఉంది. రూ.2,044.08 కోట్లను బడ్జెట్‌ అంచనాల్లో మిగులుగా చూపించారు.¤ ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు (ఐపీపీబీ) తొలి వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ సిబ్బంది అవార్డులు అందుకున్నారు. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వీటిని అందజేశారు. ‘కౌన్‌ బనేగా బాహుబలి', ‘ఆజ్‌ కా బాద్‌షా', ‘సాక్షం గ్రామ్‌' అనే మూడు విభాగాల్లో తెలంగాణకు 12 అవార్డులు దక్కాయి.రాష్ట్రీయం (ఆంధ్రప్రదేశ్‌)¤ ఏపీఎస్‌ఆర్టీసీకి రూ.728.34 కోట్లు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులిచ్చింది. రుణాల కింద రూ.550 కోట్లు, బస్సుల్లో వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీలకు సంబంధించి రీఇంబర్స్‌మెంట్‌ కింద రూ.178.34 కోట్లు విడుదల చేసింది.¤ ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు (ఐపీపీబీ) తొలి వార్షికోత్సవం సందర్భంగా పలు విభాగాల్లో ఏపీకి అవార్డులు దక్కాయి. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టల్‌ బ్యాంకును ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో విశేషంగా కృషి చేసిన వారికి కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అవార్డులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మూడు విభాగాల్లో 14 అవార్డులు దక్కాయి. చిన్న మొత్తాల పొదుపు, ఉపాధి హామీ కూలీల వేతనాలు, భరోసా పింఛన్లు తదితర సేవలు అందించడానికి ఐపీపీబీలో ఖాతాలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో అధిక ఖాతాలు తెరిపించిన వారికి ఆజ్‌కా బాద్‌షా, ఖాతాలను ఎక్కువగా పథకాలతో జత చేసిన వారికి కౌన్‌ బనేగా బాహుబలి, గ్రామం మొత్తం ఖాతాలు తెరిపించిన వారికి సాక్షం గ్రామ్‌ పురస్కారాలు అందజేశారు.

No comments:

Post a Comment