కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 9

సెప్టెంబరు - 9
ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి నియమితులయ్యారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దీనికి ఆమోదం తెలిపారు. లక్ష్మణ్‌రెడ్డి అయిదేళ్లపాటు సేవలు అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లోకాయుక్త చట్టాన్ని సవరిస్తూ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించేందుకు వీలు కల్పించింది. కడప జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాలెంలో 1945 ఏప్రిల్‌ 18న ఒక వ్యవసాయ కుటుంబంలో లక్ష్మణరెడ్డి జన్మించారు. జస్టిస్‌ లక్ష్మణరెడ్డి ఏపీ హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. సామాజిక అంశాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులపై వచ్చే ఫిర్యాదులను లోకాయుక్త విచారించవచ్చు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్‌విప్, ప్రజావ్యవహారాలతో ముడిపడిన అంశాలపై ప్రభుత్వం నియమించే అధికారులు, సర్పంచి, ఉపసర్పంచి, మేయర్, డిప్యూటీ మేయర్, ఎంపీపీ తదితరులపై అందే ఫిర్యాదులను విచారించవచ్చు.

No comments:

Post a Comment