చంద్రునిపైకి మానవ రహిత అంతరిక్ష నౌకను తొలిసారిగా ప్రయోగించిన దేశం?

చంద్రునిపైకి చైనా తన మొట్టమొదటి మానవ రహిత అంతరిక్ష నౌక ‘చాంగ్-5(చాంగె-5)’ను నవంబర్ 24న విజయవంతంగా ప్రయోగించింది.





చైనాలోని హైనాన్ ప్రావిన్సులోని వెన్‌చంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ స్టేషన్ నుంచి లాంగ్‌మార్చ్-5 రాకెట్ ద్వారా నవంబర్ 24న ఉదయం 4.30 గంటలకు చాంగ్-5 అంతరిక్ష నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు చైనా చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో కంటే ఇది అత్యంత సంక్షిష్టమైందని, గత 40 ఏళ్లలో ఎవ్వరూ చేపట్టని ప్రయోగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చాంగ్-5 విశేషాలు...
చంద్రుని ఉపరితలంపైని నమూనాలను సేకరించి, తిరిగి భూమిని చేరుకోవడమే ఈ ప్రయోగం లక్ష్యం.
అంతరిక్షం నుంచి నమూనాలను సేకరించే లక్ష్యంగా చైనా మొదటిసారిగా చేపట్టిన ఈ ప్రయోగం ముగిసేందుకు 20 రోజులకుపైగా సమయం పట్టనుంది.
ఈ అంతరిక్ష నౌక బరువు ఎనిమిది టన్నులు
చంద్రుని ఉపరితలంపై లాండర్ దిగి నమూనాలు సేకరించే ప్రాంతం పేరు ఓషన్ ఆఫ్ స్టార్మ్స్. ఇక్కడ గతంలో ఎవ్వరూ నమూనాలు తీసుకోలేదు.

చంద్రుడిపై జెండా పాతిన రెండో దేశం?

No comments:

Post a Comment